నారద వర్తమాన సమాచారం
తాగునీరు, పారిశుద్ధ్యం, పౌరసేవల్లో మాట రానివ్వొద్దు: మాజీమంత్రి ప్రత్తిపాటి
మున్సిపల్ కమిషనర్, అధికారులతో ప్రత్తిపాటి సమీక్షా సమావేశం
ప్రజలకు ముఖ్యమైన అవసరాలైన తాగునీరు, పారిశుద్ధ్యం సహా ఏ పౌరసేవల్లో లోటు రానివ్వొద్దని, ప్రభుత్వానికి మాట తేవొద్దని అధికారులకు స్పష్టం చేశారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు. నిధుల విషయం ప్రభుత్వం చూసుకుంటుందని , సేవల విషయంలో క్షేత్రస్థాయి అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆయన సూచించారు. మరీ ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా కొన్నిరోజులుగా కలవర పెడుతున్న డయేరియా వంటి నీటి ఆధారిత అనారోగ్యాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బుధవారం చిలకలూరిపేటలోని తన నివాసంలో మున్సిపల్ కమిషనర్, అధికారులతో ప్రత్తిపాటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య, వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ పనులతో పాటు డంపింగ్ యార్డుకు చెత్త తరలింపు, తదితర అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. పట్టణంలో పనిచేయని వీధి దీపాలను గుర్తించి మరమ్మతులు చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల పట్టణ శివారు ప్రాంతాల్లో దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణవ్యాప్తంగా పారిశుద్ధ్య పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. రహదారుల వెంట పెద్ద మొత్తంలో వ్యర్థాలు వేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం కొత్తనీరు వచ్చే సమయం కావడం తో పాటు పరిసరాల శుభ్రంగా లేకపోతే రకరకాల అనారోగ్యాలు ప్రబలుతాయని, దోమల నియంత్ర ణ సరిగా లేకుంటే డెంగీ, విష జ్వరాలు వెంటాతాయని వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకో వాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు ప్రత్తిపాటి పుల్లారావు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.