నారద వర్తమాన సమాచారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. కొత్తగూడెం లోని గౌతమ్ పూర్ హత్య కేసులో నలుగురి అరెస్ట్..
కట్టుకున్నదే కసాయిగామారింది
వివాహేతర సంబంధమే కారణం..
మంటగలుస్తున్న మానవ సంబంధాలు.
ఎటు పోతుంది సమాజం
వివరాలు వెల్లడించిన డిఎస్పి రెహమాన్
తెలంగాణ
కొత్తగూడెం
జులై 10..
భర్త ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే భార్య,బంధువులు గట్టిగా వ్యతిరేకిస్తారు.కానీ మంటగలుస్తున్న మానవ సంబంధాల నేపథ్యంలో భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ,భర్తను హత్య చేసేందుకు భర్త ప్రియురాలు తో పాటు భార్య,అల్లుడు సహకరించడం సహ నిందితులుగా ఉండడం విషాదం,ప్రేమించి మతాంతర వివాహం చేసుకొని మరో వ్యక్తితో శారీరక సుఖం కోసం భర్తను కడ తీర్చడంలో తన వంతు పాత్ర పోషించింది ఆ ఇల్లాలు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి …
తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి పధకరచన చేసి భర్త ను హత్య చేసిన కేసులో నిందితులను టూ టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
గౌతమ్ పూర్ లో ఈ నెల 6 న జరిగిన డ్రైవర్ సాహూ ఈశ్వర్ కుమార్ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.దీనికి సంబంధించిన వివరాలను కొత్తగూడెం డిఎస్పి బుధవారం టూ టౌన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చుంచుపల్లి మండలం గౌతమ్ పూర్ లో నివాసం ఉండే సాహు ఈశ్వర్ కుమార్ భార్య రెహనాకు అదే ప్రాంతానికి చెందిన రమేష్ కు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది.దీనికి భర్త ఈశ్వర్ అడ్డొస్తున్నాడని రమేష్ మరో వ్యక్తి బట్టు చందు తో కలిసి ఈశ్వర్ ఈనెల 6న కత్తితో దాడి చేశారు. ఈశ్వర్ కుమార్ ఖమ్మం అస్పత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రధాన నిందితుడు అరికే రమేష్,సాహు ఈశ్వర్ కుమార్ భార్య రెహానా,, రమేష్ అల్లుడు భట్టు చందు,రమేష్ భార్య అరికే ఇందిరను అరెస్ట్ చేశారు.
గౌతమ్ పూర్ పంచాయతి చెందిన సాహు ఈశ్వర్ భార్య రెహానా సింగరేణి క్వార్టర్ టీ 2-29c లో నివాసముంటున్నారు, వీరు15 ఏళ్ల క్రితం మతాంతర వివాహం చేసుకున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు,అదే ప్రాంతంలో ఎదురు బ్లాకులో నివాసముంటున్న ఆటో డ్రైవర్ అరిక రమేశ్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న సాహూ ఈశ్వర్ నువ్వు చేస్తున్నది తప్పని మన పిల్లల భవిష్య దృష్టిలో ఉంచుకొని ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని భార్య రెహనాకునచ్చ చెప్పాడు, రమేష్ చేస్తున్న తప్పుని ఆటో యూనియన్ పెద్దల దృష్టికి తీసుకువెళ్లగా వారు కూడా అతనిని మందలించారు. మళ్లీ ఇలాంటి తప్పు చేయాలని వారికి హామీ ఇచ్చాడు కానీ వారి బుద్ధి మారకపోగా వీరికి భర్త సాహు ఈశ్వర్ అడ్డు పడుతున్నాడని, ప్రియుడితో కలసి భర్తను హత్య చేయాలని రెహానా పథకం వేసింది. అందులో భాగంగా ఈనెల 6 వ తేదీన ఈశ్వర్ భార్య ద్వారా ఈశ్వర్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకొని ఇంట్లో వెళ్లి ఈశ్వర్ పైన ఆరిక రమేష్, రమేష్ అల్లుడు చందు కలసి విచక్షణారహితంగా ఈశ్వర్ పై కత్తులతో దాడి చేస పొడుస్తున్న ఈశ్వర్ భార్య కనీసం అడ్డుకోకపోవడం గమనార్హం. ఈశ్వరుని కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆస్పత్రికి తరలించారు అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ ఈనెల 7వ తేదీన మృతి చెందాడు.మృతుని తల్లి చంద్రకళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఈ కేసుతో సంబంధం నలుగురిని రిమాండ్ కు తరలించారు.ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి టూ టౌన్ ఎస్హెచ్ఓ తొగటి రమేష్ కుమార్ జిల్లా ఎస్పీ డీఎస్పీ అభినందించారు, రివార్డును కూడా ప్రకటిస్తారని తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.