నారద వర్తమాన సమాచారం
దక్కన్ క్రానికల్ కార్యాలయం పై దాడికి ఎ.పి.యు.డబ్ల్యూ.జే ఖండన!
విశాఖపట్టణం లోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై విద్యార్థి సంఘం కార్యకర్తలు చేసిన దాడిని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఖండించింది.
ఆమేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు ,ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఎ.పి.ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ బుధవారం ఒక మీడియా ప్రకటనలో విడుదల చేశారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తకు నిరసనగా తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ కార్యకర్తలు కొందరు విశాఖలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై రాళ్లు విసిరి, సంస్థ బోర్డును తగలబెట్టడం దిగ్భ్రాంతి కలిగించిందని , దీన్ని పత్రికా స్వేచ్ఛపై దాడిగా పరిగణిస్తున్నామని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏ.పి.యు.డబ్ల్యూ.జే. నేతలు ఆప్రకటనలో తెలిపారు.
దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని , ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని యూనియన్ అధికార యంత్రాంగాన్ని కోరింది. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా తమ కార్యకర్తలను అదుపు చేయాలని విద్యార్థిసంఘం రాష్ట్ర నాయకులకు యూనియన్ విజ్ఞప్తి చేసింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.