నారద వర్తమాన సమాచారం
పేద వారి ఇంట్లో ఉడకనంటున్న కందిపప్పు
చుక్కులను చూపిస్తున్న కంది పప్పు ధరలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రంలో పప్పుల ధరలు సామాన్యులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
రిటైల్ మార్కెట్లో గతనెల రూ.150-160గా ఉన్న కేజీ కందిపప్పు ఇప్పుడు ఏకంగా రూ.180-200 పలుకు తోంది.
సూపర్ మార్కెట్లో రూ.220 వరకు విక్రయిస్తున్నారు.
మినప్పప్పు కేజీ రూ. 90-120 ఉండగా ప్రస్తుతం రూ.140-160కి పెరిగింది.
పెసర పప్పు కేజీ రూ.100 నుంచి రూ.120కి చేరింది.
గతేడాది వర్షాభావం వల్ల ఈసారి ఉత్పత్తి 40% తగ్గిందని, అందుకే రేట్లు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.