నారద వర్తమాన సమాచారం
జనాభా నియంత్రణ భూమికి ఒక వరం
ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్
ప్రపంచ జనాభా దినోత్సవం పక్షోత్సవాలు పురస్కరించుకొని సోమవారం పల్నాడు జిల్లా కోసూరు మండలం అనంతవరంలో జనాభా దినోత్సవం పై ప్రదర్శన జరిగింది ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ జనాభా నియంత్రణ భూమికి ఒక వరం అన్నారు ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11వ తేదీ 1987న జనాభా ఐదు బిలియన్లకు చేరిన సందర్భంగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పాలకమండలి ప్రతి సంవత్సరం జనాభా దినోత్సవం ఉత్సవాలు నిర్వహించడానికి నిర్ణయించడం అయినది అన్నారు దీనిని పురస్కరించుకొని వైద్య ఆరోగ్యశాఖ తరఫున ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన నినాదంతో ప్రజల్లో జనాభా పెరుగుదలతో ముడిపడి ఉన్న ఆరోగ్యం, ఆర్థికం, పునరుత్పత్తి, పర్యావరణం మొదలైన వాటిపై కలిగే ప్రతికూల అంశాలను చర్చించుటకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ఈ సంవత్సరం తల్లి మరియు బిడ్డ శ్రేయస్ కోసం సరైన సమయంలో గర్భధారణ బిడ్డకు బిడ్డకు మధ్య అంతరం అనే నినాదమును ప్రతిపాదించి ప్రజలలో అవగాహన కల్పించుటకు ప్రభుత్వం వారు నిర్ణయించినారని పేర్కొన్నారు ఈ కార్యక్రమం జూన్ 27 నుండి జూలై 24 వ తేదీ వరకు నెల రోజులు పాటు రెండు పక్షోత్సవాలగా విభజింపబడి నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా అధిక జనాభా వలన కలిగే అనర్ధాలు నిరుద్యోగం, వలసలు, వనరుల కొరత, పేదరికం, పాండమిక్స్, మరియు ఏపిడిమిక్స్, వాతావరణ మార్పులు , శాశ్వత, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా సిబ్బంది
చిన్న కుటుంబం_చింతల లేని కుటుంబం,
కాన్పుల మధ్య ఎడం-తల్లి బిడ్డల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం_దేశ సౌభాగ్యం,
తాత్కాలిక కుటుంబ నియంత్రణ పాటించటం, ఆరోగ్యంగా జీవించండి,
బాల్య వివాహాలు వద్దు-సరియైన వయసులో వివాహం ముద్దు అంటూ వీధుల్లో నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త డివి పద్మావతి ఉపాధ్యాయులు సిహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.