భూ నిర్వాసితులతో సమావేశం నిర్వహిస్తున్న ఆర్డీవో శేఖర్ రెడ్డి
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
పురపాలక కేంద్రంలో సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గౌరెల్లి టు భద్రాచలం హైవే పనుల్లో భూమి కోల్పోతున్న భీమనపల్లిలో 72 మంది రైతుల 23 ఎకరాలు, మెహర్ నగర్ గ్రామలో 35 మంది రైతుల 8 ఎకరాల భూమి కోల్పోతున్న నేపథ్యంలో వారితో సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్ రెడ్డి హాజరై భూనిర్వాసితుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రేటు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం ఆదేశం జారీ చేసిందని ఆయన తెలిపారు. ఎలాంటి అభ్యంతరాలు ఉన్న రైతులు తెలుపగలరనిగ కోరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి, ఆర్ ఐ వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.