నారద వర్తమాన సమాచారం
హెల్మెట్ ధరించండి సురక్షతంగా గమ్యస్థానాలు చేరండి
న్యాయమూర్తి ఎం మురళి గంగాధరరావు
పిడుగురాళ్ల
మోటార్ వాహన చట్టం నిబంధనల గూర్చి అవగాహనా సదస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి వారి ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, గుంటూరు వారి సూచనల మేరకు పిడుగురాళ్ళ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ యమ్.మురళీ గంగాధర రావు ఆధ్వర్యములో “హెల్మెట్ ధరించండి సురక్షితంగా గమ్యస్థానాలు చేరండి” అంటూ నినాదాలు ఇస్తూ స్థానిక సివిల్ జడ్జి
జూనియర్ డివిజన్ కోర్టు, పిడుగురాళ్ల నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు వన్- కె – వాక్ బహిరంగ ర్యాలీ నిర్వహించి మోటార్ వాహన చట్టాలు, నిబంధనల గూర్చి పబ్లిక్ ర్యాలీ గురువారం ఉదయం జరిగినది. ఈ పబ్లిక్ ర్యాలీ నందు న్యాయమూర్తి యమ్ మురళిగంగాధర రావు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం హెల్మెట్ ధరించాలని తెలియజేసారు. ఈ కార్యక్రమములో న్యాయ వాదులు, కోర్ట్ సిబ్బంది, పానెల్ న్యాయవాదులు, కోర్ట్ కానిస్టేబుల్స్, పారా లీగల్ వాలంటీర్స్ , న్యాయవాది గుమాస్తాలు, కక్షిదారులు శిరస్త్రాణం హెల్మెట్ వినియోగించకపోవడం వలన కలిగే దుష్ప్ర భావాలను తెలియజేసారు.
హై కోర్టు తీర్పు ప్రకారం ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ రక్షిత శిరస్త్రాణం లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమాన విధించబడుతుందని తెలియజేసారు. హెల్మెట్ రక్షిత శిరస్త్రాణం లేకుండా ప్రయాణించి తమ కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమములో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె కుమారస్వామి, సెక్రటరీ కె వెంకటేశ్వర్లు, దారా చెన్నయ్య, ఉడతా కోటేశ్వరరావు, కంభంపాటి కోటేశ్వరరావు, ఎస్ కె మౌలాలి, ఏ సీతారామయ్య, చంద్రశేఖర్ రావు, ప్రశాంత్ నాయక్, పి నవ్య, మందా జాకబ్, ఎస్ వి కోటేశ్వర రావు, యమ్ రాజశేఖర్, అయాజ్ అహ్మద్, కోర్ట్ సూపరింటెండెంట్ యమ్ ప్రభాకరరెడ్డి, కోర్ట్ సిబ్బంది, కోర్ట్ కానిస్టేబుల్స్, పానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్ వి నాగార్జున, న్యాయవాద గుమాస్తాలు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమమును విజయవంతం చేసిన బార్ అసోసియేషన్ సభ్యులకు న్యాయమూర్తి ఎమ్.మురళి గంగాధరరావు కృతజ్ఞతలు తెలియజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.