
నారద వర్తమాన సమాచారం
ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడండి
పిడుగురాళ్లజులై 23 మోటార్ వాహన చట్టం నిబంధనల గూర్చి అవగాహనా ర్యాలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి వారి ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, గుంటూరు వారి సూచనల మేరకు పిడుగురాళ్ళ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ యమ్ మురళీ గంగాధర రావు సూచన మేరకు పిడుగురాళ్ల పట్టణంలో కోర్టు పారా లీగల్ వాలంటీర్ వడ్లమూడి నాగార్జున ఆధ్వర్యములో “హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడండి, సురక్షితంగా గమ్యస్థానాలు చేరండి” అంటూ నినాదాలు ఇస్తూ పిడుగురాళ్ల ఐలాండ్ సెంటర్లో ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మోటార్ వాహన చట్టాలు, నిబంధనల గూర్చి పబ్లిక్ ర్యాలీలో పట్టణ విలేకరులు నాగరాజు, శ్రీనివాసచారి, అశోక్, మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం (హెల్మెట్) ధరించాలని హై కోర్టు తీర్పు ప్రకారం ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమాన విధించబడుతుందని, హెల్మెట్ (రక్షిత శిరస్త్రాణం) లేకుండా ప్రయాణించి తమ కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ విలేకరులు
పి గురుమూర్తి, ఎస్ పేరయ్య, పి బాజీ,ఒ గోపిరాజు, ఆర్ గణేష్ , సిహెచ్ వి ఎల్ నరసింహారావు, ఏ శ్రీనివాసరావు, వడ్లమూడి శ్రీను తదితరులు
ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







