నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు
గౌరవ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మరియు న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి వారి ఆదేశానుసారం మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, గుంటూరు వారి సూచనల మేరకు పిడుగురాళ్ళ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ యమ్.మురళీ గంగాధర రావు ఆధ్వర్యములో, పిడుగురాళ్ళ బార్ అస్సోసియేషన్ వారి సహకారం తో పట్టణ ప్రాధమిక హెల్త్ సెంటర్, పిడుగురాళ్ళ పట్టణం నందు న్యాయ అవగహన సదస్సు ది.08.08.2024 నిర్వహించడం జరిగినది. ఈ న్యాయ అవగాహనా సదస్సు నందు న్యాయమూర్తి యమ్.మురళిగంగాధర రావు మాట్లాడుతూ NALSA (ఆదివాసి హక్కుల పరిరక్షణ మరియు అమలు) పథకం, 2015ని అమలు చేయాలని మరియు ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో నుంచి వచ్చిన పేషెంట్స్ కి తగిన వైద్య సదుపాయాలను తప్పకుండ అమలు చేయాలని మరియు వారికి గల న్యాయ పరమైన హక్కులు తెలియజేసినారు. ఈ కార్యక్రమములో పాల్గొన్న బార్ అస్సోసియేషన్ ప్రెసిడెంట్ కె. కుమారస్వామి మాట్లాడుతూ మెడికల్ సిబ్బంది ప్రతి వారం ట్రైబల్ గ్రామాలకు వెళ్లి వారికీ వైద్య సేవలు అందించాలని మరియు పేషెంట్స్ కు ఆరోగ్యానికి సంబంధించి ప్రాధమిక సలహాలను తెలియపరచవసినదిగా వైద్య సిబ్బంది కి చెప్పినారు.
ఈ కార్యక్రమములో బార్ అస్సోసియేషన్ సెక్రటరీ కోపూరి వెంకటేశ్వర్లు, న్యాయవాదులు, మందా జాకబ్, ప్యానెల్ న్యాయవాది జి.రమేష్, కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్ వి.నాగార్జున మరియు పట్టణ ప్రాధమిక హెల్త్ సెంటర్ విద్యాధికారి
డా. అనిల్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమమును విజయవంతం చేసిన బార్ అసోసియేషన్ సభ్యులకు న్యాయమూర్తి ఎమ్.మురళి గంగాధరరావు కృతజ్ఞతలు తెలియజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








