Saturday, November 23, 2024

దిల్లీలో జగన్ రెడ్డి దొంగ డ్రామాలు అట్టర్ ఫ్లాప్: ప్రత్తిపాటి

నారద వర్తమాన సమాచారం

దిల్లీలో జగన్ రెడ్డి దొంగ డ్రామాలు అట్టర్ ఫ్లాప్: ప్రత్తిపాటి

ప్రజల దృష్టిని మళ్లించడానికి దేశ రాజధాని దిల్లీలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఆడిన డ్రామాలు, చేసిన దొంగ ధర్నా అట్టర్ ఫ్లాప్ అయ్యాయని ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఇన్నాళ్లు చేసిన చేసిన హత్యలు, దారుణాల రక్తపు మరకల్ని అంత త్వరగా తుడిచేసుకోవడం కూడా సాధ్యం కాదని ఈ పరిణామాలు అతడికి అర్థం అయ్యేలా చేశాయని, జగన్‌ రెడ్డి దిల్లీ ధర్నాను కనీసం పట్టించుకున్న వారు ఎవరు లేరని చురకలు వేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఏదో జరిగిపోతోందంటూ దిల్లీలో జగన్ బుధవారం చేసిన ధర్నాపై ఒక ప్రత్యేక పత్రికా ప్రకటనను విడుదల చేశారు ప్రత్తిపాటి. తన అయిదేళ్ల రాక్షస పాలనలో ప్రజలప్రాణాలతో చెలగాటం ఆడుకున్న వ్యక్తి ప్రభుత్వం మారిన నెల వ్యవధిలోనే ఇలా పెడ బొబ్బలు పెడుతుండడం, ఢిల్లీలో ధర్నాలకు దిగడం అంతా నాటకంగానే కనిపిస్తోందని తీవ్ర స్థాయిలో ఆక్షేపించారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చింది మొదలు మొన్నటి ఎన్నికల్లో ఓటమి వరకు ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఉసురు పోసుకున్నారో మరిచిపోయారా అని జగన్‌ను సూటిగా ప్రశ్నించారు ప్రత్తిపాటి. డా.సుధాకర్ నుంచి అమర్నాథ్ గౌడ్ వరకు వందల ప్రాణాలు తీసిన నీచ చరిత్ర దాచిపెట్టి దొంగధర్నాలు చేస్తే ప్రజలు నమ్మే రోజులు పోయాయని గుర్తుంచుకోవాలన్నారు. అసెంబ్లీకి రావడానికి ముఖం చెల్లకపోతే, శ్వేతపత్రాల రూపంలో బయటపడుతున్న అయిదేళ్ల అక్రమాలపై సమాధానం చెప్పలేకపోతే ఆ మాటే నేరుగా ఒప్పుకోవచ్చుగా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రత్తిపాటి. అలానే, శవరాజకీయాలే ఊపిరిగా పార్టీని నడిపే జగన్‌కు శాంతిభద్రతల గురించి మాట్లాడే నైతికహక్కే లేదన్నారు. ఒక్క ఛాన్స్ అన్న మాటను నమ్మి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించారని, దానికి విసుగు చెందే అదే ప్రజలు కనీసం ప్రతిపక్షనేత స్థానం కూడా ఇవ్వకుండా తిరస్కరించినా బుద్ధి మారకుంటే ఎలా అని ప్రశ్నించారు ప్రత్తిపాటి. అతడి అబద్ధాలను, తప్పుడు ప్రచారాలను రాష్ట్రంలో ప్రజలు నమ్మడం మానేశారు.. ముఖం మీదే చీకొడుతున్నారు కాబట్టే జగన్‌ తన డ్రామాలను దిల్లీకి మార్చారని మండిపడ్డారు ప్రత్తిపాటి.
ఇంటిల్లిపాదిని చంపి… జడ్జి ముందు తల్లీతండ్రి లేని అనాథయ్య కనికరించండని ఏడ్చేరకం జగన్ రెడ్డి అని, ఇకపై అతడు ఇలాంటి ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని ధర్నాలు దిగినా ఎవరూ నమ్మే పరిస్థితే లేదన్నారు. అయిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసి, ఇంతగా విశ్వసనీయత పోగొట్టుకు న్న ఏకైక వ్యక్తి బహుశా జగన్ ఒక్కడే అయి ఉంటాడన్నారు ప్రత్తిపాటి పుల్లారావు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version