నారద వర్తమాన సమాచారం
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అణచివేసిందే జగన్: ప్రత్తిపాటి
రాష్ట్రంలో సివిల్ సర్వీస్ అధికారుల పేరిట వైకాపా, జగన్ దొంగ డ్రామాలు మొదలు పెట్టారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. కూటమి ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేసే ప్రయత్నం చేస్తోన్న మాజీ జగన్ రెడ్డి హయాంలోనే నిజానికి అఖిల భారత సర్వీసుల అధికారులను దారుణమైన స్థితిలో అణచివేతకు గురి చేశారని మండిపడ్డా రాయన. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా వివాదస్పదమై, ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టడంపై వైకాపా తప్పుడు ప్రచారాలు చేస్తోందని శనివారం ప్రత్తిపాటి పత్రికా ప్రకటనలో ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇన్ని ధర్మ పన్నాలు చెబుతున్న జగన్, వైకాపా వాళ్లు నాటి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం విషయంలో ఏం చేశారో గుర్తులేదా? అని ప్రశ్నించారు. సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఐదేళ్ల పాటు పోస్టింగ్ ఇవ్వకుండా ఎలా వేధించింది… సస్పెన్షల మీద సస్పెన్షన్ల తో ఎలా ఎలా ఇబ్బంది పెట్టింది మరిచిపోయారా అని గుర్తుచేశారు. అంతేకాక సివిల్స్ అధికారుల సర్వీస్ రిజిస్టర్లు జగన్ వద్దే పెట్టుకుని వేధించారని ఆరోపించారు. ఒక ఎంపీని లాకప్‌లో హింసించిన అధికారులపై చర్యలు తీసుకోకూడదా? అని ప్రశ్నించారు. వైకాపా హయాంలో చేసిన తప్పులపై వారే సిగ్గుతో తల దించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తప్పుచేసిన అధికారులపై చర్యలు తీసుకోవడం తమ ప్రభుత్వ నిర్ణయమనీ స్పష్టం చేశారు ప్రత్తిపాటి పుల్లారావు .
Discover more from
Subscribe to get the latest posts sent to your email.