నారద వర్తమాన సమాచారం
విచ్చలవిడిగా నడుపుతున్న బెల్ట్ షాపులు
మండలంలొ బెల్టు షాపుల జోరు
క్రోసూరు మండలంలో బెల్టు షాపులకు బ్రేకులు పడటం లేదు. ప్రధాన రహదారుల పక్కన గ్రామాల్లోని వీధి వీధికి ఎక్కడబడితే అక్కడ మద్యం బెల్టు షాపులు కొనసాగుతున్నాయి. పాన్ షాప్ లు బెల్టులకు కేంద్రంగా మారాయి. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో విచ్చలవిడిగా బెల్డులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ ఉద్యోగులే బెల్టులకు మద్యం సరఫరా చేస్తున్న ఆరోపణలు లేకపోలేదు. డోర్ డెలివరీ అయితే క్వార్టర్ బాటిల్ పై రూ 20 లు నేరుగా షాపుల వద్ద అయితే రూ 10లు అదనంగా
తీసుకొని బెల్టు నిర్వాహకులకు మద్యం సరఫరా చేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. మద్యంపై కొత్త పాలసీని తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం లో అడ్డు అదుపు లేకుండా బెల్టు వ్యాపారం కొనసాగింది. మద్యం షాపుల్లో పనిచేసే ఉద్యోగులంతా ఆ పార్టీ వారే కావడంతో అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. దీంతో వాళ్ళు ఇచ్చిన మద్యం ని మందుబాబులు తప్పక తీసుకునే పరిస్థితి ఉండేది. స్టాకు సిద్ధంగా ఉన్న సరే కొన్ని బ్రాండ్లను బెల్టులకు మినహాయించి ఏవేవో బ్రాండ్లను మాత్రమే ఇచ్చేవారు. నచ్చిన బ్రాండ్ ను అడిగినవారుకి ఏమీ లేవు ఉన్న బ్రాండ్లు తీసుకొని పోండి అనేవారు. చేసేది ఏమీ లేక వాళ్ళుచ్చే మద్యాన్ని మందుబాబులు తీసుకొని వెళ్లే పరిస్థితి, అయితే గత వైసిపి ప్రభుత్వం పోయి ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అయినప్పటికీ మద్యం షాపుల ఉద్యోగుల అక్రమ సంపాదనకు ఏమాత్రం తెరపడలేదు. ఇంకా గత ధోరణిలోనే బెల్టులకు మద్యం సరఫరా చేస్తు ఉన్నారు. విచ్చల విడిగా బెల్టు షాపులు కొనసాగుతున్న అధికారులెవరూ పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇకనైనా కూటమి పాలకులు దృష్టి సాధించి మద్యం షాపుల ఉద్యోగుల అక్రమ దందాకు అడ్డుకట్ట వేసి బెల్టు షాపులను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ సందర్భంగా ఎక్సయిజ్ ఎస్సై ని వివరణ కోరగా సమాధానం ఇవ్వడంలేదు. ఎన్ని కేసులు నమోదు చేసారని అడగ్గా దురుసుగా మాట్లాడుతున్నారు. కేసులు ఉన్న నేను చెప్పను. పత్రికలలో న్యూస్ రావడం నాకు ఇష్టం ఉండదని బదులు ఇచ్చారు. ఈ సందర్భంగా సి.ఐ లేకపోవడంతో ఎస్సై ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారని పలువురు తెలుపుతున్నారు. సీఐ ని నియమించాల్సిందిగా అదేవిధంగా బెల్టు షాపులపై తగుచర్యలు తీసుకోలని గ్రామప్రజలు కోరుతున్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.