నారద వర్తమాన సమాచారంపల్నాడుఈరోజు అటవీ భూముల ఆక్రమణ పరిరక్షణలో భాగంగా జిల్లా ఫారెస్ట్ అధికారి రామచంద్ర రావు ఆదేశాల మేరకు అటవీ శాఖ అధికారులు మరియు పల్నాడు జిల్లా అడవుల పరిరక్షణ కమిటీ వారు గుత్తికొండ గ్రామంలో ప్రజల్ని కలిశారు ఈ సందర్భంగా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నీలిమ దేవీ వారితో మాట్లాడుతూ అడవుల్ని ఆక్రమించాలని బాగు చేసుకుని క్రయవిక్రయాలు జరపాలని చూస్తే ఊరుకునేది లేదు వారు ఎంతటి వారైనా వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని ఈ విషయంలో గ్రామస్తులంతా సహకరించాలని వారికి హెచ్చరిక జారీ చేశారు. అలాగే బిలం మరి కొన్ని ప్రాంతాలు దర్శించి ఈ ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కొత్తగా ఎక్కడ కూడా ఆక్రమనలు జరగకుండా చూస్తామని అడవుల అక్రమణా మరియు పర్యావరణ పరిరక్షణ కొరకు కృషి చేస్తామని పల్నాడు అడవుల పరిరక్షణ కమిటీ వారితో కలిసి పని చేస్తామని మీడియాతో మాట్లాడుతూ వచ్చారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది బీట్ ఆఫీసర్లు శ్యాం కుమార్ , మనోజ్ కుమార్ స్ట్రైకింగ్ ఫోర్స్ తో పాటు పల్నాడు జిల్లా అడవుల పరిరక్షణ కమిటీ సభ్యులు కే కుమార్, డి అబ్రహం, ఎం నాగరాజు, జాషువా, సిహెచ్ ఆంజనేయులు, టీ ప్రతాప్, రిపోర్టర్ వి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.