నారద వర్తమాన సమాచారం
జిల్లా కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ను ఏర్పాటు అవసరము.
-డా. చదలవాడ హరిబాబు
సి సి ఐ జాతీయ ఉపాధ్యక్షుడు.
జిల్లాకు నూతన జాయింట్ కలెక్టరుగా విచ్చేసిన ఏ . భార్గవ తేజ, ఐ ఏ ఎస్ ను జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు కలిసి, జిల్లా వినియోగదారుల ప్రొటెక్షన్ కౌన్సిల్ ఏర్పాటు చేసి, మీటింగులు నిర్వహించలేదని, విజిలెన్స్ కమిటీ మెంబర్లకు మీటింగ్ ఏర్పాటు చేసి విధి విధానాలు తెలుపకపోవడం జరిగినదని కేంద్ర ప్రభుత్వము మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 200 ను సవరిస్తూ జారీచేసి జూన్ 1 నుండి నిబంధనలు అమలు చేయవలసి ఉండగా గుంటూరు జిల్లాలో సంబంధిత అధికారులు అమలు జరుపుటలేదని జాయింట్ కలెక్టర్ వారి దృష్టికి తీసుకువచ్చారు. జాయింట్ కలెక్టర్ ను కలిసినవారిలో గర్తపురి వినియోగదారుల సమితి అధ్యక్షులు డా. చదలవాడ హరిబాబు, పసుపులేటి మల్లికార్జునరావు, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు బీరాల నాగేశ్వరరావు, బేబి సరోజిని, మునిపల్లె కవిత, నాగమణి ఉన్నారు. అనంతరం “గీత దాటితే శిక్షలే” గోడ ప్రతిని జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.