నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్,
తేదీ.26.7.2024.
పల్నాడు జిల్లాలో ఎక్కడైనా ర్యాగింగ్ కు పాల్పడిన, ర్యాగింగ్ ను ప్రోత్సహించిన, మాదక ద్రవ్యాలను వినియోగించిన వాటిని సరఫరా చేసిన ఊరికునేది లేదు, అట్టి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోనబడతాయి- పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్
పల్నాడు జిల్లాలోని అన్ని స్కూల్స్, కాలేజీలు,బీటెక్ మరియు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలతో సుమారు 200 మందితో యాంటీ ర్యాగింగ్ మరియు యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..
ఏ విద్యాసంస్థలో కూడా ర్యాగింగ్ అనేది ఉండకూడదని ఆ విధంగా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు ర్యాగింగ్ చట్టాల గురించి వివరించాలని, అదేవిధంగా అన్ని విద్యాసంస్థల్లో అందరికీ కనిపించేలా ర్యాగింగ్ చట్టాలని గోడపై పేస్ట్ చేయాలని సూచించారు.
అన్ని విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని అదేవిధంగా విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగము, సరఫరా గురించి నిఘా పెట్టాలని అందుకుగాను అన్ని విద్యా సంస్థలలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని విద్యా సంస్థలకు సూచించారు.
కనీసం విద్యార్థులతో వారానికి ఒకసారి అయినా మీటింగ్ ఏర్పాటు చేసి వీటన్నిటిపై చర్చించాలని కాలేజీ యాజమాన్యాలకు ఎస్పీ తెలియచేశారు.
జిల్లాలో ఈమధ్య కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయని వీటన్నింటి పైన వెంటనే చట్ట ప్రకారం కేసులు నమోదు చేశామని వీటిలో ఇప్పటికే అరెస్టులు చేశామని ఇంకా అరెస్టులు కావాల్సిన వారి గురించి ప్రత్యేక టీమ్స్ పెట్టి పట్టుకుని అరెస్టులు పూర్తి చేస్తామని తెలియచేశారు.
ప్రజలు కూడా ఇటువంటి ర్యాగింగ్, మాదకద్రవ్యాలు (గంజాయి) సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్న పోలీసులకు తెలియజేయాలని కోరారు.
అదేవిధంగా ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన సమీప పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని, చట్టాన్ని చేతులు తీసుకొని గోడవలకు దిగరాదని సూచించారు.
సంఘ విద్రోహశక్తులైన రౌడీలను,గుండాలను, ప్రజలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూసే వారిని పోలీసులు ఉపేక్షించేది లేదని వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.