నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా
పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
జిల్లాలో పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పీఆర్ వన్ యాప్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్ వన్ యాప్ ద్వారా జిల్లాలో పారిశుద్ధ్య పరిస్థితులను పర్యవేక్షిస్తామన్నారు. ఎంపీడీఓలు, ఈవోఆర్డీ లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ లు యాప్ గురించి సంపూర్ణ అవగాహన తెచ్చుకోవాలన్నారు.
క్షేత్ర స్థాయి పరిస్థితులను యాప్ లో నమోదు చేసే కార్యక్రమాన్ని ఆదివారం సైతం కొనసాగించాలని ఆదేశించారు. ఆదివారం నాటికి యాప్ నమోదులో వెనకబడిన మండలాల అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో డీపీఓ ఎం.విజయ భాస్కర్ రెడ్డి, డీఎల్డీఓలు వెంకట్ రెడ్డి (నరసరావు పేట), గఫూర్ నాయక్ (గురజాల), రాజగోపాల్ (సత్తెనపల్లి), డీపీఆర్వో ఓం ప్రకాశ్ రెడ్డి మరియు ఎంపీడీఓలు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.