జి జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ వేడుక
నారద వర్తమాన సమాచారం, ఆర్మూర్,
ఆర్మూర్ పట్టణంలోని జి జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్నేహితులు ఒకరినొకరు ఫ్రెండ్షిప్ బంధన్ లు కట్టుకొని మిఠాయిలు తింటూ శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది అనంతరం ఆర్మూర్ ట్రాఫిక్ సిఐ వోడి రమేష్ మాట్లాడుతూ ఫ్రెండ్షిప్ అనేది చాలా పవిత్రమైన బంధమని స్నేహితుల ద్వారా నిత్యజీవితంలో ఎంతో ఆనందం,ఉత్సహం లభిస్తుందని వారు కొనియాడారు. అందులో భాగంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి ఎం.జె.ఎఫ్. మాట్లాడుతూ స్నేహానికి ఎలాంటి కుల మత బేధ భావం ధనిక పేద లాంటి ఏమాత్రం తారతమ్యం వుండధని స్నేహం అనేది ఒక గొప్ప పనిముట్టు అని తద్వారా నిత్యజీవితంలో ఎదురుకోనే ఎలాంటి సమస్యలైన సులువుగా పరిష్కరించు కోవచ్చు అని ప్రతి ఒక్కరూ స్నేహాన్ని ప్రేమానురాగాలను సంపాదించాలని కొనియాడారు. ఇట్టి కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆదర్శ్ మాజీ అధ్యక్షులు డిజె దయానంద్, లయన్స్ క్లబ్ గ్రీన్ జోన్ చైర్మన్ చేపూర్ గనేశ్, రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ మాజీ అధ్యక్షులు విద్యా ప్రవీణ్ ,బొచ్కర్ వెను,బెళ్దార్ శ్రీనివాస్,గోపి,విశాల్,కాశినాథ్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.