లిల్లీపుట్ పాఠశాలలో ఘనంగా స్నేహితుల దినోత్సవ సెలబ్రేషన్
నారద వర్తమాన సమాచారం,
అర్మూర్,
లిల్లీపుట్ పాఠశాలలో స్నేహితుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకున్నారు ఒకరితో ఒకరు ఆప్యాయంగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ స్నేహితుల దినోత్సవం చాలా విశేషం అని ఆప్యాయతకు అనురాగానికి సహాయానికి ఒక మంచి నిదర్శనం అని తెలియజేశారు .అంతేకాకుండా తల్లిదండ్రులు అక్క చెల్లెలు అన్నదమ్ములు అనే బంధాన్ని దేవుడు ఇచ్చిన వరం అయితే తాను సొంతంగా ఏర్పరచుకునే ఒక గొప్ప బంధం అని నిజమైన స్నేహితుడు దొరకడం ఒక గొప్ప వరం అని విద్యార్థులకు తెలియజేశారు అంతేకాకుండా స్నేహితుల దినోత్సవం ఎలా ప్రారంభమైందో విద్యార్థులకు తెలియజేశారు 1938 అమెరికాలోని ఒక స్నేహితుడు కోసం ఇంకో స్నేహితుడు చేసిన గొప్ప త్యాగానికై ఆగస్టు మొదటి శనివారం రోజున ఈ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారని తెలియజేశారు ఒకరిపట్ల ఒకరికి స్నేహం అనేది చాలా అవసరమని మంచి స్నేహితులతో సహవాసం అనేది జీవితంలో చాలా ప్రాముఖ్యమని ప్రతి ఒక్కరూ స్నేహంతో మెలగాలని విద్యార్థులకు తెలియజేశారు అంతేకాకుండా ప్రీ ప్రైమరీ విద్యార్థులు వేకిల్స్ డే సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల వెహికల్స్ ప్రదర్శనలో వెహికల్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు గ్రీన్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ వంటి వాటిని చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ ప్రిన్సిపల్ దాసు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.