నారద వర్తమాన సమాచారం
ఈ రోజు అంతర్జాతీయ బీర్ డే
బీర్ అనేది ప్రపంచంలోని అత్యంత విస్తృతంగా సేవించే ఆల్కహాల్ డ్రింక్స్‌లో ఒకటి. మరి ఈ బీరు పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసా?
అసలు బీరుకు ఓ రంగును రూపును..రుచిని ఇచ్చింది తెచ్చింది అంతా మహిళలే నని మీకు తెలుసా? *ఈరోజు అంతర్జాతీయ బీర్ డే..🍻🍺* సందర్భంగా బీరు పుట్టుపూర్వోత్తరాలు..దాని చరిత్ర గురించి తెలుసుకుందాం…!!
సుమారు 7వేల సంవత్సరాల క్రితం మెసోపోటామియా సంస్కృతిలో బీరు కల్చర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది.
అప్పట్లో ఆడవాళ్లు బలవర్థకమైన ఆహారం అంటే ఇప్పుడు ఇమ్యూనిటీఫుడ్ అని అంటున్నామే దాని కోసం అంబలి కాచుకునేవారు. అంబలి అంటే అందరూ కాచుకునేదే. కానీ కొంతమంది మరీ డిఫరెంట్ గా కాస్తారు కదా. అలా కొంతమంది ఆడవాళ్లు మాత్రం ధాన్యాలకు మూలికలను కూడా కలిపి వాటిని నీళ్లలో బాగా మరిగించి పానీయాలు తయారు చేసేవారు. అలా మరిగించిన ఆ పానీయాలను నిల్వ చేసేవారు. అవి పులిసిపోయి విచిత్రమైన వాసన, రుచి మారేది. అది తాగితే లైట్ గా మత్తుగా మధురంగా ఉండేది. అందుకే అప్పట్లో వాటిని మత్తు ద్రావణాలు అని అనేవారు. ఆ మత్తు వారికి బాగుండేది. ఏదో లోకంలో విహరించినట్లుగా వింతగా సరదాగా ఉండేది. దాంతో చాలా మంది వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా మంచి నీళ్లు, టీ,కాఫీ తర్వాత ఎక్కువ మంది బీరే తాగుతారు.
జర్మనీకి చెందిన ఓ సన్యాసిని చొరువతో న్యూలుక్..!! అలా మధ్యయుగం నాటికి పులిసిన పానీయాల తయారీ, వాటి అమ్మకం బాగా పెరిగింది. ఉన్నత వర్గాల నుంచి కింది వర్గాల వరకూ అంతా వాటికి అలవాటుపడ్డారు. కానీ పులిసిన ఆ పానీయాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేవి కాదు. పాచి వాసన వచ్చేవి. దీంతో రకరకాల ప్రయోగాలకు తెరతీశారు. అలా పలు ప్రయోగాల్లో భాగంగా గంజాయి మొక్కలకు చెందిన హోప్స్ మొక్క పువ్వులను వేచి కాచేవారు. అవి ద్రావణాలను పాడుకాకుండా ఉంచడంతో పాటు మత్తు పాళ్లు కాస్త పెరిగాయి. అలా బీరులోకి కిక్ మొదలైందన్నమాట.
జర్మనీకి చెందిన ఓ సన్యాసిని.. హిల్డెగార్డ్ ఆఫ్ బింగెన్ (హిల్డెగార్డ్) విప్లవాత్మక ధోరణితో ఆధునిక కాలంలో బీర్‌కు ఒక రూపం తీసుకొచ్చింది. అయితే బలవర్థకమైన ఈ పులిసిన పానీయాలను డొమెస్టిక్ నుంచి కమర్షియల్‌గా మార్చేయాలన్న ఆలోచన వచ్చింది మాత్రం మగవాళ్లకేనని. ఆడవాళ్లు తెలివిగా గుర్తించిన సహజమైన కార్బొనేషన్‌ను పక్కనపెట్టేసి.. బలవంతంగా పరిశ్రమల్లో కార్బొనేషన్‌ను ఎక్కించటం మొదలుపెట్టారు.
ఇంటర్నేషనల్ బీర్ డే పుట్టు పూర్వోత్తరాలు..🍺🍻 2007లో కాలిఫోర్నియా, శాంటా క్రూజ్‌కు చెందిన జెస్సే అవ్‌షాలోమోవ్న్ అనే తాగుబోతు ఈ బీర్ డే పుట్టుకకు కారణం. అది ఓ మందుబాబు పుణ్యం అన్నమాట. 2012 దాకా ఆగష్టు 5నే ఇంటర్నేషనల్ బీర్ డేను జరిపేవారు. అయితే
ఆ తర్వాత ఆగష్టు మొదటి శుక్రవారంను బీర్ డేగా నిర్వహించుకోవాలని మందుబాబులకు పిలుపునిచ్చాడు జెస్సే. అలా పాశ్చాత్య సంస్కృతి నుంచి పుట్టిన ఈరోజు( 2024 ఆగస్టు 2) ఇప్పుడు దాదాపు 80కిపైగా దేశాల్లో జరుగుతోంది. ముఖ్యంగా 200 నగరాల్లో ఈ బీర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు మందుబాబులు. ఆ లిస్ట్‌లో మన భారత కూడా ఉంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.