నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీసు వారి కార్యాలయంలోనిర్వహించిన ప్రజా సమస్యల పరిస్కర వేదిక లో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన “పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఆర్ .రాఘవేంద్ర ;
ఈ ప్రజా సమస్యల పరిస్కరవేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, కొనుకున్న స్థలంలో కొట్టు పెట్టుకోగా YSRCP నాయకులు అక్రమించారని, కన్నకొడుకులు ఇంటిని వాళ్ళ పేరు మీద రాయమని కొట్టి, చంపుతామని బెదిరిస్తునట్లు, పంటపొలం పాడు చేసారని, ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసంచేసినట్లు,కుటుంబ తగాదాలు, అద్దెకు ఉండే వాళ్ళ సామాను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతునట్లు, మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు అందాయి.
నరసరావుపేట, 12వ వార్డు, పాలెం నగర్ కు చెందిన కుంజ నంద, తండ్రి రాములు, 60 సంవత్సరములు, కులం ఎరుకల అను అతను 2011 వ సంవత్సరంలో ఒక సెంటున్నర స్థలమును నరసరావుపేట అరండల్ పేటలో కొనుగోలు చేసి సదరు స్థలములో అద్దెకి ఇచ్చుకునే విధంగా రేకుల షెడ్డులను నిర్మించినాడు, సదరు షాపులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సదరు కొట్టు తాళాలు పగలగొట్టి సదరు కొట్టును ఆక్రమించుకున్నట్లు రిపోర్ట్ ఇవ్వడమైనది.
రొంపిచర్ల మండలం, నల్లగార్లపాడు గ్రామానికి చెందిన అచ్చి వీరయ్య భార్య నాగేంద్రం ను ఆమెను వాళ్ళ చిన్న కుమారుడు ఆస్తి పంచవమని లేకుంటే చంపుతామని బెదిరిస్తున్నట్లు, కొట్టి ఇబ్బంది పెడుతున్నట్లు రిపోర్టు ఇవ్వడమైనది.
నకరికల్లు మండలం, గుళ్ళపల్లి గ్రామానికి చెందిన షేక్ బషీరున్నీసా భర్త మీరా, 60 సంవత్సరాలు, కులం ముస్లిం అను ఆమెను తన ఇద్దరు కుమారులు ఇల్లు వాళ్ళ పేరుమీద రాసేయమని లేకుంటే ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని బెదిరిస్తున్నట్లు లేకపోతే చంపేస్తామని ఇబ్బంది పెడుతున్నట్లు రిపోర్టు ఇవ్వడమైనది.
సత్తెనపల్లి రూరల్, మురళి నగర్, ఫైర్ స్టేషన్ దగ్గర నివాసము ఉండు మోడం స్వరాజ్యం భర్త రాజశేఖర్, 25 సంవత్సరాలు, కులం మాల అనువా ఆమె వాళ్ళ భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని జీవిస్తున్నట్లు, ఆమె సత్తెనపల్లిలోని ఒక ఇంటిని అద్దెకి తీసుకొని ఒక ఆరు నెలల క్రితం హైదరాబాదులో కూలి పనులకు వెళ్లి అక్కడి నుండే ఆన్లైన్లో అద్దెను చెల్లిస్తున్నట్లు, ఇప్పుడు హైదరాబాద్ నుండి వచ్చి ఇంట్లో సామాన్లు తీసుకుందామని అడగ్గా ఇంటి ఓనరు సామాన్లు ఇవ్వకుండా, ఇంట్లోకి రానీయకుండా ఇబ్బంది పెడుతున్నట్లు రిపోర్టు ఇవ్వడమైనది.
నూజెండ్ల మండలం, మూర్తి జాపురం గ్రామంలో నివాసముండే శీలం గోవిందు తండ్రి యలమంద, 38 సంవత్సరాలు అను అతను సంబంధించిన ఆముదాల పంట వేసిన పొలంను అదే గ్రామానికి చెందిన శీలం వెంకటేశ్వర్లు తండ్రి యోగయ్య అను అతను సుమారు 40 సెంట్లు డోజర్ తో పంట నాశనం చేసి ఆక్రమించుకుని హద్గురాళ్ళను పీకేసినట్లు రిపోర్టు ఇవ్వడమైనది.
ముప్పాళ్ళ మండలం, తొండిపి గ్రామానికి చెందిన ఇందూరి ప్రమిత భర్త వెంకటేశ్వర రెడ్డి, 31 సంవత్సరాలు, కులం కమ్మ అను ఆమె భర్త ఆర్మీ ఉద్యోగం చేస్తూ, వివాహం చేసుకోగా వాళ్లకు ఒక అబ్బాయి సంతానం కలిగినట్లు వివాహమైన ఏడు సంవత్సరాలకు
రిటైర్ అయి వచ్చి భార్యని మానసికంగా శారీరకంగా హింసిస్తున్నట్లు అతను సొంతంగా అకాడమీ పెట్టుకోగా అది సరిగ్గా నడవ పోయేసరికి సదర విషయంలో భార్యను ఇబ్బంది పెడుతున్నట్లు రిపోర్టు ఇవ్వడమైనది.
మాచర్ల కు చెందిన మూడవత్ మల్లేశ్వరరావు నాయక్, 29 సంవత్సరాలు, కులం సుగాలి అను అతనికి గవర్న మెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని బద్దు నాయక్ తండ్రి లఘుపతి నాయక్ నమ్మబలికి ఫిర్యాదు వద్ద నుండి 5,00,000 లక్షలు రూపాయలు తీసుకుని మోసం చేసినట్లు రిపోర్టు ఇవ్వడమైనది.
ప్రజా సమస్యల పరిస్కరవేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసిపెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయసహకారాలు అందించారు. ప్రజా సమస్యల పరిస్కరవేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు ఎస్పీకార్యాలయంలో బోజనాలు పెట్టినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.