నారద వర్తమాన సమాచారం
ఇక నుండి ఎ టి ఎమ్ లో రేషన్ బియ్యం
తెలంగాణ
ఏటీఎం నుంచి నగదు డబ్బులు తీసుకోవటం మీరు చూసిఉంటారు. కానీ, ఇప్పుడు ఏటీఎం నుంచి రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు.?
ఇందుకు సంబంధించి దేశంలోనే తొలి బియ్యం ఏటీఎం మిషన్ ప్రారంభ మైంది. ఒడిశాలో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎం మిషన్ నుంచి బియ్యాన్ని తీసుకో వచ్చు. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం.
ఒడిశా ప్రభుత్వం భువ నేశ్వర్ లోని ముంచేశ్వర్ ప్రాంతంలోని గోదాములో ఈ నూతన బియ్యం ఏటీఎంను ప్రారంభించింది. రేషన్ లబ్ధిదారులు తమ రేషన్ కార్డు నెంబర్ ను బియ్యం ఏటీఎం స్కీరన్ పై నమోదు చేయాలి.
ఆ తరువాత వేలిముంద్ర వేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఏటీఎం నుంచి వచ్చే బియ్యాన్ని బస్తాలో నింపుకోవచ్చు. ప్రతీ రేషన్ కార్డు లబ్ధిదారుడు ఏటీఎం ద్వారా ఒకేసారి 25 కిలోల బియ్యాన్ని పొందవచ్చు.
ఈ విధానం ద్వారా బియ్యం కోసం రేషన్ దుకాణాల ముందు గంటల తరబడి నిలబడాల్సిన అవసరం ఉండదు. అంతేకాక అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. ప్రయోగాత్మకంగా భువనే శ్వర్ లో ఈ బియ్యం ఏటీఎంను ప్రారంభించారు.
ఒడిశాలోని మొత్తం 30 జిల్లాల్లో ఈ రేషన్ బియ్యం ఏటీఎంలను తెరిచే యోచన లో ప్రభుత్వం ఉంది. ప్రస్తు తం ఈ మోడల్ విజయ వంతం అయితే.. రేషన్ కార్డు పథకం కింద ఇతర రాష్ట్రాలకు ఈ విధానం విస్తరించనుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.