క్షత్రియ విద్యార్థుల పాలక మండలి
ఏర్పాటు.
. ముఖ్య అతిథిలుగా పాల్గొన్న భూపతిరెడ్డి, ఆల్జాపూర్ గంగాధర్….
నారద వర్తమాన సమాచారం ,
ఆర్మూర్,
ఆర్మూర్ మండల పరిధిలోని చేపూరు లో
క్షత్రియ పాఠశాలలో విద్యార్థుల పాలక మండలి 2024 – 2025 విద్యా సంవత్సరపు విద్యార్థుల పాలక మండలి (క్యాబినెట్) ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ న్యాయవాది లోక భూపతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించినారు. ముఖ్య అతిధులుగా క్షత్రియ విద్యా సంస్థల కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ సెక్రెటరీ అల్జాపూర్ దేవేందర్ విచ్చేసినారు. అతిధులు విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించినారు. దేవాంషి ప్రదర్శంచిన సాంస్కృతిక నృత్యం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీ నర సింహస్వామి స్వాగతోపాన్యాసము గావించి కార్యక్రమ విశేషాలను వివరించినారు. నాయకత్వ లక్షనాలు పెంపొదించుకోవడానికి భాధ్యత గల పారులుగా ఎదగడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగ పడ్తాయని అన్నారు. విజేతలను పోటి చేసిన అభ్యలను, బాధ్యత తో ఓటు వేసిన ఓటర్లు ను అభినందించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసేన అల్జాపూర్ గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ఎన్నికల వ్యవస్థను అర్థం చేసుకుంటే బాధ్యత గల పౌరులుగా ఎదుగుతారనే ఆకాంక్షతో క్షత్రియ స్కూల్ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు. సెక్రెటరీ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భారత రాజ్యంగమునకు లోబడి తమ తమ విద్యుక్త ధర్మాలను నిర్వహించాలని అన్నారు. ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తిని వివరించినారు. 1947 నాటి స్వాతంత్య దినోత్సవ పరిణామాలను వివరించినారు. చదువుతో పాటు, ధర్మాన్ని పాటించి మంచి పొరులుగా ఎదగాలని ఆకాక్షించారు. ఎన్నికలలో హెడ్ బాయ్ గా విజయం సాధించిన విఘ్నేష్ , హెడ్ గర్ల్ గా విజయం సాధించిన నమ్రత. డిప్యూటీ హెడ్ బాయ్ గా శ్రీజిత్, డిప్యూటీ హెడ్ గర్ల్ గా హరిణి విజయం సాదించినారు. లోక భూపతిరెడ్డి పదవీ ధృవీకరణ పత్రాలను బ్యాడ్ లను అందించారు. స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ జ్యోత్స్న పాండే విజేతల చేత బాధ్యతల ప్రమాణాలను చేయించినారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించిన సీనియర్ న్యాయవాదిలోక భూపతి రెడ్డి మాట్లాడుతూ క్షత్రియ స్కూల్ ఇటువంటి విశిష్ట కార్యక్రమాన్ని ఎంచుకొని, ఎన్నికలు నిర్వహించి, విద్యార్థి దశలోనే నాయకులను ఎన్నుకొనే ప్రక్రియ చేపట్టడం ఎంతో అభినందనీయమని అన్నారు. చదువుతోపాటు సంస్కారాన్ని అలవర్చుకొని మంచి దేశ భక్తి పౌరులుగా ఎదగాలని ఆకాక్షించినారు. ఆంగ్ల భాషతో పాటు మాతృ భాషను కూడా గౌరవిస్తూ జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతంలో అహ్లాదకరమైన వాతావరణంలో క్షత్రియ విద్యా సంస్థలు నడుపడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది.ఇటు వంటి కార్యక్రమానికి రావడం పట్ల నాకెంతో ఆనందం కలుగుతుందని భూపతిరెడ్డి అన్నారు. లోక భూపతిరెడ్డి ని అతిధి మర్యాదలతో సత్కరించినారు. సుశ్మిత వారి వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది. ఓటమి చెందిన విద్యార్థులు బాధపడకుండా, సానుకూల దృక్పధంలో గెలిచిన వారికి అండగా నిలవాలని అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.