ప్రభుత్వ స్థలాలను రక్షించండి
. ప్రభుత్వ స్థలాలకు ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నారని ఆందోళన
. ఆర్. డి. ఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన బిజెపి నాయకులు
నారద వర్తమాన సమాచారం
అర్మూర్,
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తూ కబ్జా చేసిన స్థలాలకు ఇంటి నెంబర్లను సృష్టిస్తున్నారని కలెక్టర్ కు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీ.వీ నరసింహారెడ్డి అన్నారు.
ఆర్మూర్ పట్టణంలో గతంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారని ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లను సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు బిజెపి నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డిఓ రాజా గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ స్థలాలను, ఖాళీ స్థలాలను గతంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జాలు చేస్తున్నారని ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన మున్సిపల్ అధికారులు కబ్జాదారులకు అండగా ఉండి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ కు విన్నవించిన పట్టించుకోవడంలేదని వాపోయారు. ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటూ సకల సౌకర్యాలు పొందుతూ ప్రజల ఆస్తులను మాత్రం కాపాడలేని జిల్లా కలెక్టర్ ను ఇక్కడ నుండి తరిమికొడతామని వారు హెచ్చరించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.