నారద వర్తమాన సమాచారం
చరిత్రలో ఆగస్టు పది దళితుల పాలిట బ్లాక్ డే , డి ఎస్ యం
ఎల్ బీ నగర్
ఆగస్టు
ఆగస్టు పది తారిఖు చరిత్రలో దళితుల పాలిట బ్లాక్ డే అని డి ఎస్ యం అధ్యక్షుడు వలిగొండ విజయరాజు అన్నారు. శనివారం నాడు మేడ్చల్ జిల్లా నాగా రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1950 ఆగస్టు పది న ఆనాటి రాష్ట్ర పతి బాబు రాజేంద్ర ప్రసాద్ దళితులు రిజర్వేషన్ పొందాలంటే కచ్చితంగా హిందూ మతం లోనే ఉండాలని ఉత్తర్వు ఇవ్వడం జరిగిందని.ఆ ఉత్తర్వు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించే విధంగా ఉన్నప్పటికీ డెబ్బై ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వు ( ఎస్సి) ని రాజ్యాంగం నుండి తొలగించడం లేదు. దళితుల హక్కులను హరించిన రాష్ట్ర పతి ఉత్తర్వు జారీ చేసిన ఆగస్టు పది నాడు బ్లాక్ డే పాటిస్తున్నట్టు తెలిపారు.నేటికీ దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మతం పేరుతో దళితులను విభజించిన అగ్ర కుల పాలకుల కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.అందుకు దళిత సాలిడారిటీ మూవ్ మెంట్ (ఇండియా ) మద్దతు ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దళితులను ముఖ్యంగా దళిత క్రైస్తవులను కేవలం ఓటు వరకే వాడుకుంటుందని ఆరోపించారు. అధికారంలో ఉన్న బిజెపి దళిత క్రైస్తవులకు వ్యతిరేకం అని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్గనైజింగ్ సెక్రటరీ చెరుపల్లి శ్యాంసుందర్ మాట్లాడుతూ దళిత క్రైస్తవుల సామాజిక చైతన్యం కోసం డి ఎస్ యం పనిచేస్తుందని తెలిపారు.రాష్ట్ర పతి ఉత్తర్వు వల్ల జరుగుతున్న నష్టాన్ని దళితులకు తెలియజేస్తున్నమని, దళిత క్రైస్తవులు ఐక్యం కావాలని కోరారు,ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాద్యక్షుడు పి.సురేష్ బాబు, బి.ప్రసాద్, హరోన్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.