ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్
నిర్మల్
నారద వర్త మాన
సమాచారం
ప్రతినిది
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ప్రజల అర్జీలను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు శాఖల వారిగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి, సీఎం ప్రజావాణి దరఖాస్తుల ను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ధరణి, రెవెన్యూ, వ్యవసాయం, కొత్త రేషన్ కార్డులు, ఫించన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, భూ సమస్యల వంటి అంశాలపై ఫిర్యాదులు అధికంగా వచ్చాయని సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.
అలాగే ఈనెల 5 నుండి 9 వరకు నిర్వహించిన స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో అధికారులందరూ సమన్వయంతో పనిచేశారని ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. నెలలో ప్రతీ మొదటి మూడవ శనివారాలు శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. శాఖల వారిగా కేటాయించిన ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం నషా ముక్త భారత్ కార్యక్రమం నాలుగో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, మాదకద్రవ్యాల రహిత సమాజానికి ప్రతి ఒక్కరు పాటుపడాలని తెలిపారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలను అరికట్టేందుకుగాను అధికారులచే కలెక్టర్ ప్రతిజ్ఞను చేయించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఆర్వో భుజంగ్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.