నారద వర్తమాన సమాచారం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన “పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్ .”
పల్నాడు జిల్లా పోలీస్….
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన “పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్ .”
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో, పెద్దిరెడ్డిపాలెం గ్రామము, నరసరావుపేట మండలం కు ఎరువ శివారెడ్డి s/o కోటిరెడ్డి అను అతను, అతని యొక్క కుమారులు ఎలక్షన్ సమయం లో తిరుపతి రావు తో 10 లక్షలు బెట్టింగ్ వేసుకున్నట్లు, ఈ విషయం ఫిర్యాది కి తెలియదని, ఫిర్యాది కొడుకు ఫోన్ ఆఫ్ చేసుకోవడం వలన ఫిర్యాది ని డబ్బులు కట్టమని తిరుపతి రావు బెదిరిస్తున్నట్లు రిపోర్ట్.
బొగ్గరం గ్రామము, ఈపూరు మండలం కు చెందినా ముక్కడల ఆది నారాయణమ్మ w/o కోటేశ్వరరావు అను ఆమెకు చెందిన 4 సెంట్ల స్థలము లో ఇల్లు ఉండగా, ఆ స్థలము మరియు ఇంటిని అమ్మకానికి పెట్టగా, సదరు స్థలము కు సంబంధించి డాకుమెంట్స్ గోపు భులక్ష్మి అను ఆమె ఫోర్జరీ చేసుకున్నట్లు, సదరు ఇంటి స్థలము అమ్ముకోనివుక్కుండా బెదరింపు లకు పాల్పడుతున్నట్లు రిపోర్ట్.
సరికొండపాలెం తండ గ్రామము, బొల్లాపల్లి మండలంకు చెందిన మిరజోత్ మంత్రు నాయక్ s/o చిన్న నాయక్ అను అతనికి ఎకరా డెబ్బై సెంట్ల పొలం ను బాలు నాయక్ కి కౌలు కి ఇచ్చినట్లు, 3 సం. నుండి కౌలు డబ్బులు ఇవ్వకుండా మరియు పొలము అప్పగించకుండ బెదిరిస్తున్నట్లు రిపోర్ట్
మాచర్ల పట్టణం కు చెందినా చిల్లర ఉషారాణి W/O రాజేంద్ర ప్రసాద్ అను ఆమె సం. క్రితం ఫిర్యాది కి స్థలము ఇప్పిస్తానని చెప్పి, మాచెర్ల పవన్ అను అతనికి సుమారుగా 5 లక్షలు మరియు ఒక గోల్డ్ చైన్ ఇచ్చినట్లు, కాని పవన్ స్థలము ఇవ్వకుండా మరియు డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నట్లు రిపోర్ట్.
శాంతి నగర్, మాచెర్ల పట్టణం కి చెందినా పల్లవుల కుమారి w/o ఏడుకొండలు అను ఆమెకు 20 సం. క్రిందట విహాహం అయినట్లు, ఫిర్యాది భర్త చెడు వ్యసనాలకు బానిసై ఫిర్యాది ని శారీరకముగాను మరియు మానసికము గా హింసిస్తున్నట్లు రిపోర్ట్.
చాగంటివారిపాలెం గ్రామము, ముప్పాల మండలం కి చెందిన వెంపరాల రామలింగేస్వరి w/o జేసముద్రుడు అను ఆమె భర్త అదనపు కట్నం కోసం వేదించడం వలన దూరం గా ఉన్నట్లు, ఫిర్యాది భర్త మరో విహాహం చేసుకుంటానని ఇంకా నువ్వు రావొద్దు అని బెదిరిస్తున్నట్లు, భర్త తాలుకు బంధవులు కూడా ఫిర్యాది ని బెదిరిస్తున్నట్లు రిపోర్ట్.
అచ్చంపేట్ మండలం, పెదపాలెం గ్రామము కి చెందినా అంబటి నరసింహారావు 5/0 నారాయణ మరియు కొంతమంది రైతులు తమ పొలము లోని మిర్చి పంట తన్నీరు మార్కండేయుడు మరియు శ్రీనివాస్ అను వారికి 1,42,18,914 రూపాయలకు అమ్మినట్లు, అందులో 23 లక్షలు రూపాయలు మాత్రమే ఇచ్చినట్లు, మిగత అమౌంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు రిపోర్ట్
సత్తెనపల్లి టౌన్, నాగార్జున నగర్ కి చెందిన వంకదోవాత్ శ్రీ లక్ష్మి కల్పనా బాయి w/o సూర్య నాయక్ కేతవాత్ అను ఆమెకు మాయమాటలు చెప్పి, పవన్ కుమార్ 3,50,000 రూపాయలు తీసుకొని వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానానని చెప్పి, మోసం చేసినట్లు రిపోర్ట్.
నరసరావుపేట టౌన్, రామిరెడ్డి నగర్ కి చెందిన శెట్టిపల్లి శ్రీనివాసరావు w/o సాంబయ్య అను అతనికి ఆంధ్ర బ్యాంకు లో ఉద్యోగం ఇప్పిస్తానానని చెప్పి, మల్లేశ్వరరావు 5,00,000 రూపాయలు తీసుకొని మోసం చేసినట్లు రిపోర్ట్.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.