నారద వర్తమాన సమాచారంపల్నాడు జిల్లా పోలీస్,తేది.04.9.2024.రోడ్ సేఫ్టీ పై మరియు సరియైన ధ్రువీకరణ పత్రాలు లేని మోటార్ వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు..ది.03.9.2024 వ తేదీన పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నరసరావుపేట 2 టౌన్ సిఐ ఆధ్వర్యంలో పట్టణంలో ఏకంగా 10 మంది ఎస్ఐ లు, 30 మంది స్టాఫ్ తో రోడ్డు భద్రత మరియు ధృవీకరణ పత్రాలు లేని మోటార్ వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఏకంగా 107 ఎటువంటి పత్రాలు లేని, నెంబర్ ప్లేట్స్ లేని,రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వాహనాలను సీజ్ చేసిన పల్నాడు జిల్లా పోలీసులు..
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా కూడా వాహనానికి సరైన దృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని అదేవిధంగా బైక్ లను జాగ్రత్తగా రోడ్లపై నడపాలని, తాగి వాహనాలు నడపరాదని, స్నేక్ డ్రైవింగ్ లాంటివి చేయకూడదని రోడ్లపై ప్రజల యొక్క ప్రాణాలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా వాహనదారులు ప్రవర్తించాలని ప్రజలను కోరారు.
అలా కాక విచ్చలవిడిగా రోడ్లపై వాహనాలు నడిపిన యెడల అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
ఈ సీజ్ చేయబడిన వాహనాలకు సంబంధించి ఓనర్లు సరైన పత్రాలు తీసుకొని వచ్చిన యెడల వాటిని విడుదల చేయడం జరుగతుందని లేనియెడల వాటిని కోర్టుకు అప్పగించడం జరుగుతుందని తెలియజేశారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.