నారద వర్తమాన సమాచారం
తేదీ 11.09.2024
దాచేపల్లి మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి డి పాప కుమారి వారు మరియు మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ శోభా రాణి వారు RTI ACT – 2005 మీద శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో రైతులకు, ప్రజలకు మరియు అధికారులకు అందరికీ ఈ చట్టం యొక్క ఇంపార్టెన్స్ గురించి విధివిధానాల గురించి వివరంగా చెప్పడం జరిగింది.
రైతులకు, ప్రజలకు RTI ACT ద్వారా ఎలా ఇన్ఫర్మేషన్ పొందాలని,
అధికారులకు RTI ACT రిసీవ్ చేసుకున్నప్పుడు ఎటువంటి రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి, రిజిస్టర్స్ ఏ విధంగా రాయాలి, వారికి
ఇన్ఫర్మేషన్ను ఏ విధంగా అందించాలి అనే వాటి మీద వివరంగా శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఈ శిక్షణా కార్యక్రమంలో రైతులు, ప్రజలు, మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలోని సిబ్బంది మరియు రైతు సేవా కేంద్రం ఉద్యోగులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.