నారద వర్తమాన సమాచారం
దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం లో భాగంగా పత్తి లో అంతరసాగు పద్దతులపై రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన మండల వ్యవసాయ అధికారులు
తేదీ 29.10.2024 న దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలో పొలం పిలుస్తోంది ప్రోగ్రాం ను నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాం లో భాగంగా పత్తిలో అంతర సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం దర్శి నుంచి విచ్చేసిన డాక్టర్ జి రమేష్ ప్రోగ్రాం కోఆర్డినేట్ కే వి కే దర్శి మాట్లాడుతూ అంతర సాగు పద్ధతిలో సాళ్ళ మధ్య దూరం మరియు మొక్కల మధ్య దూరం తగ్గించి వేయటం ద్వారా పొలాల్లో సంప్రదాయ పద్ధతి కన్నా ఎక్కువ మొక్కలను పెంచుకోవచ్చు. వీటి వలన దిగుబడి పెరుగుతుంది మరియు చమత్కార్ను మొక్కలకు పిచికారి చేయడం వలన మొక్క ఎత్తు పెరగటం కాయ బరువు వచ్చి పత్తి మొత్తం ఒకేసారి పగులుతుంది. దీని వలన పంట దిగుబడి పెరుగుతుంది. పత్తి 2,3 తీతలలోనే వచ్చి గులాబి రంగు పురుగు ఆశించే కాలం కన్నా ముందే పంట చేతికి వస్తుంది అని రైతులకు వివరించడం జరిగింది.
మండల వ్యవసాయ అధికారి దాచేపల్లి వారు మాట్లాడుతూ జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, పత్తిని సిసిఐ లో అమ్మాలనుకున్న రైతులు రైతు సేవా కేంద్రాలలో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని, పత్తి ధర 7521 / క్వింటా కు ఉన్నవి అని, పత్తిని రైతులు లూసుగానే కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్లాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ టీ వెంకటేశ్వర రెడ్డి సేద్య విభాగం కె వి కె దర్శి , Ao పాప కుమారి , గ్రామ సర్పంచ్ , కె భవ్య Yp -II, ఎం భువనేశ్వరి, ఎన్ వి నాయక్ Yp – I , సి. శేఖర్ తదితరులు మరియు రైతు సోదరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.