నారద వర్తమాన సమాచారం
ప్రకృతి వ్యవసాయ విధానంలో పలు పంటల ద్వారా అధిక ఆదాయం
తేది.26.09.2024న దాచేపల్లి మండలం గామాల పాడు గ్రామం లో వాసం స్వప్న ,వారి బంతి తోట ను ప్రాజెక్టు మేనేజర్ అమల కుమారి సందర్శించడం జరిగింది అమల కుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో పండించిన బంతి పంటకు రసాయన వ్యవసాయంలో పండించిన బంతి పంటకు వ్యత్యాసాన్ని వివరించడం జరిగింది ప్రకృతి వ్యవసాయంలో బంతి పూలు చాలా ఎక్కువగా రావడం గమనించడం జరిగిందిప్రకృతి వ్యవసాయంలో ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్(PMDS) వేసిన జిల్లాలో 42312 మంది రైతులను ఇక్రాప్ బుకింగ్ చేయవలసినది గా చూచించారు.
పత్తిలో అంతర పంటలుగా గోరు చిక్కుడు ,చెట్టు చిక్కుడు ,గోంగూర ,ముల్లంగి, క్యారెట్ పెసర ,మరియు రక్షక పంటలుగా జొన్న సజ్జ వేయడం ద్వారా పత్తిని ఆశించే తెల్ల దోమ పచ్చ దోమ ఉదృతి తక్కువగా ఉంటుందని రక్షక పంటలు వేయడం ద్వారా మిత్ర పురుగులు సంఖ్య పెరుగుతుందని సూచించడం జరిగింది. అంతేకాకుండా పత్తిని ఆశించే గులాబీ రంగు పురుగు ఉదృతి తగ్గుతుందని సూచించడం జరిగింది. అంతేకాకుండా కంది ప్రథాన పంట లో బోర్డర్ క్రాప్ గా జొన్న, మొక్కజొన్న , గోరుచిక్కుడు, మినుము, పెసర, దోశ, కాకర, గోంగూర, తోటకూర వేసుకొవాలని తెలియ జేశారు
మిర్చి ప్రథాన పంట లో ఉల్లి , ముల్లంగి, కొత్తిమీర, బంతి, కెరట్, ఆముదం , బోర్డర్ క్రాప్ గా జొన్న మొక్కజొన్న సజ్జ వేసుకోవాలని తెలియ జేయడం జరిగింది
ఈ కార్యక్రమానికి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి ఎన్ ఎఫ్ ఎ అప్పల రాజు , మాస్టర్ ట్రైనర్ బాజీబాబు మోడల్ మేకర్ హసీనా ,యూనిట్ ఇన్చార్జి కొత్తపల్లి రమేష్ కందుల రమేష్ M. జ్యోతి ఐసీఆర్ పి లు రైతులు పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.