Friday, November 22, 2024

ముఖ్యమంత్రి సహాయ నిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం

నారద వర్తమాన సమాచారం

ముఖ్యమంత్రి సహాయ నిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం

హైదరాబాద్:
వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి కి రిలయన్స్‌ ఫౌండేషన్‌ భారీ విరాళాన్ని అంద జేసింది. రూ.20 కోట్ల చెక్కును సీఎంఆర్‌ఎఫ్‌కు అందజేశారు.

శుక్రవారం ఉదయం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి ఎం ఎస్ ప్రసాద్, బోర్డు సభ్యులతో పాటు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రిలయన్స్ గ్రూప్ మెంటార్ పి వి ఎల్ మాధవ రావులు జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎంను కలిసి ఆయనకు రూ.20 కోట్ల చెక్కును అందజేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వరద సంభవించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం జిల్లా పూర్తిగా నీట మునిగింది. అనేక మంది ఇళ్లను కోల్పోయారు.

ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేం దుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్‌, మహేశ్‌ బాబు, సాయిధరమ్‌తేజ్‌, విశ్వక్‌సేన్‌ సహా పలువురు విరాళాలు అందించారు.

ఈ కార్యక్రమంలో పి ఎం ఎస్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & బోర్డు సభ్యులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్,పి వి ఎల్ మాధవరావు, పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version