నారద వర్తమాన సమాచారం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ J.V. సంతోష్(అడ్మిన్)
పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయం,
నరసరావుపేట పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ J.V. సంతోష్(అడ్మిన్)
ఈ స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 67 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని అడిషనల్ ఎస్పీ సూచించారు.
పెదకూరపాడు మండలం చిన్న మక్కెన గ్రామానికి చెందిన గోరంట్ల వెంకటేశ్వర్లు తన ఇద్దరు కుమారులకు సమభాగాలుగా ఆస్తి పంచి ఇచ్చి, రెండు ఎకరాల పొలం తన పోషణ కొరకు ఉంచుకొనగా, తన పెద్ద కుమారుడు అయిన శ్రీనివాసరావు అతని భార్య ఫిర్యాదు పొలాన్ని కౌలుకు ఇవ్వకుండా అడ్డుపడుతూ పొలం వారి పేరు మీద రాయమని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నందుకు గాను అడిషనల్ ఎస్పీ కి ఫిర్యాదు చేయడం జరిగింది.
అచ్చంపేట మండలం కస్తల గ్రామానికి చెందిన షేక్ మౌలాలి మరియు అతని గ్రామస్తుడైన నబీ రసూల్ అను వారు వారి పిల్లల ఉద్యోగం నిమిత్తం వారికి పరిచయస్తుడు ఆయన గంగాధరరావు అను అతనికి సాఫ్ట్వేర్ ఉద్యోగం కొరకు 1,30,000/-రూపాయలు ఇవ్వగా ఉద్యోగం ఇప్పించకుండా డబ్బులు అడిగితే ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని అడిషనల్ ఎస్పీ కి ఫిర్యాదు చేయడం జరిగింది.
నరసరావుపేట శ్రీరాంపురం లో గల జామియా మసీదు పునఃనిర్మాణం కొరకు గత ప్రభుత్వ హయాంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు అయిన షేక్ ఖాజావలి, షేక్ రహంతుల్లా, షేక్ సిలార్ ,షేక్ ఆదామ్ అనువారులు 3,10,00,000/-అవుతుందని ఎస్టిమేషన్ చెప్పి చందాలు వసూలు చేసి మసీదు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ జమా ఖర్చుల లెక్కలు చూపకుండా మరియు అంజుమన్ స్థలంలో షాపులు కట్టిస్తామని 56 లక్షల వసూలు చేసి షాపులు నిర్మించకుండా జమా ఖర్చులు చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు మోసగించిన వారిపై చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అడిషనల్ ఎస్పీ కి ఫిర్యాదు చేయడం జరిగింది.
నరసరావుపేట పట్టణానికి చెందిన ముండ్రు శివప్రసాద్ అను అతను 2023 వ సంవత్సరం మే నెలలో ICF Corporation నందు మార్కెటింగ్ అసోసియేట్ గా చేరడం జరిగింది. విధులలో భాగంగా 10 మందితో లోన్ అప్లై చేయించగా కంపెనీవారు 10 మంది వద్ద మీకు లోన్ అప్రూవల్ అవ్వాలంటే మాకు లాగిన్ ఇన్సూరెన్స్, లీగల్ సెక్యూరిటీ కు సంబంధించి 60 వేల నుండి 80 వేల వరకు ముందుగా కట్టాలని చెప్పి యున్నారు. ఇంట్రెస్ట్ తక్కువగా వస్తుందని ఆశపడి వారు అడిగిన అమౌంట్ పదిమంది కట్టినారు. కంపెనీ వారు సుమారు 8.30 లక్షల రూపాయాలు ఆ పది మంది దగ్గర తీసుకొన్నారు.వారికి ఇప్పటికినీ లోన్ రాకపోయేటప్పటికి కంపెనీ చేసిన మోసానికి గాను మేము కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమని ఫిర్యాదుని అడుగుతున్నట్లు, కావున సదరు కంపెనీపై చర్య తీసుకోననవలసింది గా ఫిర్యాది అడిషనల్ ఎస్పీ కి ఫిర్యాదు చేయడం జరిగింది.
నరసరావుపేట రాజరాజేశ్వరి నగర్ కు చెందిన చండ్ర రవీంద్రబాబు కు ఉన్న 5.89 సెంట్లు
పొలమునకు గాను 89 సెంట్లు అమ్మదలిచి రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్లగా పొలం కొనుగోలు చేసే నరిశెట్టి అనురాధ మరియు మరి కొంతమంది కలిసి ఫిర్యాది ని మోసపూరితంగా 89 సెంట్లు తో పాటుగా 5 ఎకరాలు కూడా వారి పేరు మీద మార్చుకున్న విషయమై అడిషనల్ ఎస్పీ కి ఫిర్యాదు చేయడం జరిగింది.
చిలకలూరిపేట కు చెందిన మున్నంగి వెంకట రత్నారెడ్డి, మానుకొండ వారి పాలెం గ్రామానికి చెందిన మానుకొండ శ్రీకాంత్ రెడ్డి అను అతను మాజీ ఎమ్మెల్యే విడుదల రజని వద్ద ప్రైవేట్
PA గా ఉంటూ ఫిర్యాదు కి అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సప్లై చేయుటకు జిల్లా మొత్తం కాంట్రాక్టు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి 28,00,000/- రూపాయలు తీసుకున్నట్లు, మధ్యవర్తుల ద్వారా అడుగగా బెదిరిస్తున్నాడని అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది.
నరసరావుపేట మండలం గ్రామానికి చెందిన కిలారు సత్యవతి సుమారు రెండు సంవత్సరాల క్రితం స్వర్ణ నాగరాజు అను అతనికి ఏసీ ఇప్పిస్తాను అంటే 25,000/- ఫోన్ పే ద్వారా పంపించినట్లు, ఇంతవరకు ఏసీ ఇప్పించకపోగా తిరిగి డబ్బులు అడిగితే బెదిరిస్తున్నట్లు ఫిర్యాది
అడిషనల్ ఎస్పీ కి ఫిర్యాదు చేయడం జరిగింది.
పిడుగురాళ్ల పట్టణానికి చెందిన షేక్ మస్తాన్ బి కి ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి సంతానం అవ్వగా ఫిర్యాది ఆస్తిని సమభాగాలుగా పంపిణీ చేసి ఒక ఎకరం పొలం ఉంచుకొని కౌలుకు ఇచ్చి జీవన సాగిస్తుండగా సదరు ఫిర్యాదు కుమారుడు అయిన జానీ భాష ఆ పొలాన్ని నేనే కౌలు చేసుకుంటాను అని డబ్బులు ఇవ్వకుండా ఆ పొలాన్ని అమ్ముకుంటాను అని ఫిర్యాదుకు కుటుంబ పోషణ లేకుండా చేస్తూ ఇబ్బంది పెడుతున్నందుకుగాను ఫిర్యాది అడిషనల్ ఎస్పీ కి ఫిర్యాదు చేయడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసిపెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు దాతలు అన్నదానం ఏర్పాటు చేసినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.