నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
జాతిపిత మహాత్మాగాంధీ 155వ జయంతిని పురస్కరించుకొని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ) కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో పాల్గొని,గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐ.పి.యస్.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ
గాంధీజీ సత్యం,అహింస ఆయుధాలుగా భారత దేశపు స్వేచ్ఛా స్వాతంత్ర్య సమరాన్ని ముందుండి నడిపారు.
అహింసా మార్గంలో ఉద్యమించి బానిస సంకెళ్లు తెంచి బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి విముక్తి కలిగించిన మహాత్ముడి బోధనలు నేటికీ అనుసరణీయం.
ఆత్మాభిమానం, ఆత్మగౌరవం వేరెవరో పరిరక్షించరు…మనకు మనమే వాటిని కాపాడుకోవాలని ఆయన చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకం.
జాతిపిత చూపిన బాటను అనుసరిస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడమే మన ముందున్న కర్తవ్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో J.V. సంతోష్ జిల్లా అదనపు పోలీసు అధికారి(పరిపాలన)
D.రామచంద్ర రాజు
అదనపు పోలీసు అధికారి(ఆర్మ్ డ్ రిజర్వ్) నరసరావు పేట డియస్పి నాగేశ్వరరావు తో పాటు పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.