నారద వర్తమాన సమాచారం
మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి లకు ఘన నివాళి
క్రోసూరు
మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి ల జయంతులను పరిష్కరించుకొని వారి చిత్రపటాలకు బుధవారం పల్నాడు జిల్లా క్రోసూరు మండలం కోసూరు పిహెచ్సిలో వైద్య సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ సత్యాగ్రహం, అహింస అనేవి మహాత్మా గాంధీ నిర్మించిన రెండు గొప్ప సిద్ధాంతాలని, ఎన్నో ఏళ్లుగా బ్రిటిష్ తొత్తుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న భారతదేశాన్ని బ్రిటిష్ వారి శృంకలాల్ నుంచి విముక్తి కలిగించి దేశానికి స్వేచ్ఛను ప్రసాదించటంలో మహాత్ముని పాత్ర అద్భుతం అన్నారు 1956 వా సంవత్సరంలో ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో దేశాన్ని నడిపించి గెలిపించిన ధీరుడు లాల్ బహుదూర్ శాస్త్రి అని అన్నారు కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం ఎన్నో నూతన ప్రయోగాలు ఆవిష్కరించారు అని పేర్కొన్నారు జై జవాన్ జై కిసాన్ నినాదం తీసుకొని ప్రజల్లోకి వెళ్లిన మహానుభావుడు శాస్త్రి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాంబశివరావు, ఆరోగ్య పర్యవేక్షకులు శివుడు, అమర జ్యోతి, స్టాఫ్ నర్స్ రాణీ, ల్యాబ్ టెక్నీషియన్ ప్రభాకర్ రావు, ఫార్మసిస్ట్ ఫాతిమా, హెల్త్ అసిస్టెంట్ ఫ్రాంక్లిన్ ఫిలిప్ ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.