నారద వర్తమాన సమాచారం
ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్…
తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయ్ నిధి స్టాలిన్‌పై పరోక్ష విమర్శలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. పవన్ వ్యాఖ్యలపై ఉదయ్‌నిధి స్టాలిన్‌తో పాటు డీఎంకే నేతలు స్పందిస్తున్నారు. ఉదయ్‌నిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు..
సనాతన ధర్మం పరిరక్షణ కోసం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించిన డిక్లరేషన్ దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తిరుపతి వారాహి సభతో పవన్ కళ్యాణ్ దేశం దృష్టిని ఆకర్షించారు. ఎవరిపై ప్రత్యక్షంగా ఆరోపణలు, విమర్శలు చేయకుండానే సనాతన ధర్మాన్ని విమర్శించే వ్యక్తులపై తనదైన స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయ్ నిధి స్టాలిన్‌పై పరోక్ష విమర్శలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. పవన్ వ్యాఖ్యలపై ఉదయ్‌నిధి స్టాలిన్‌తో పాటు డీఎంకే నేతలు స్పందిస్తున్నారు. ఉదయ్‌నిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కొందరు వైరస్‌తో పోల్చారని.. ఇటువంటివి సరికాదంటూ ఉదయ్ నిధి స్టాలిన్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయ్ నిధి స్టాలిన్ స్పందిస్తూ.. వెయిట్ అండ్ సీ అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని డీఎంకే నేతలు వరుస ప్రకటనలు విడుదల చేశారు. మతం పేరుతో మూఢనమ్మకాలు, మోసాలకు తాము వ్యతిరేకమని తెలిపారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు తమిళనాడు నుంచి తుడిచిపెట్టుకుపోయారంటూ డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ పేర్కొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.