నారద వర్తమాన సమాచారం
పల్నాడు:-
రేషన్ బియ్యం అక్రమ దందాకు అడ్డుకట్టవేయలేరా…?
పేద ప్రజలకు అందాల్సిన బియ్యం పక్కదారి
నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహారిస్తున్న అధికారులు
అక్రమ బియ్యం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న చౌక ధరల బియ్యం అక్రమార్కులకు వరంగా మారింది. పల్నాడు జిల్లాలోని గురజాల ,దాచేపల్లి ,మాచవరం ,కారెంపూడి , పెద్దకూరపాడు ,అమరావతి ,అచ్చంపేట ,క్రోసూరు , బెల్లంకొండ ,రాజుపాలెం,సతైనపల్లి ,నియోజకవర్గంలోని రెడ్డిగూడెం , గ్రామంలో నుండి రాత్రి వేళ రేషన్ బియ్యాన్ని ఆటోలు ,డిసిఎమ్ ,వాహనాల ద్వారా నకరికల్లు లోని ఓక ప్రముఖ రైస్ మిల్లు కు తరలించి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు .
పల్నాడు ప్రాంతాంలో రేషన్ అక్రమ దందా రెండు రకాలుగా జరుగుతుంది. వ్యాపారస్తులు ఇంటింటికి తిరిగి తక్కువ ధర కి రేషన్ బియ్యాన్ని సేకరించడం .రెండవది రేషన్ దుకాణాల నుంచే దర్జాగా పక్కదారి పట్టించడం అందులో రేషన్ డీలర్ల వద్ద లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకొని వారికి ఇవ్వాల్సిన బియ్యానికి బదులుగా డబ్బులు ఇస్తూ పేదలకు అందాల్సిన బియ్యాన్ని అక్రమార్కులకు అమ్ముతూ వారి వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు గా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు .
అక్రమ దందాను అరికట్టెందుకు అధికారులు , పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్న కానీ మాఫియా అక్రమ దందా మాత్రం ఆగడం లేదు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఎన్ని సంస్కరణలు తెచ్చినా కానీ సంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా కానీ ఫలితం లేకుండా పోతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. రేషన్ షాప్ ల వద్దనుండి పేదలకు అందాల్సిన బియ్యాన్ని అక్రమ వ్యాపారస్తులు బస్తాలలో నింపుకొని టూ వీలర్ పై బహిరంగంగానే బియ్యం నిల్వ చేసే వారి స్థావరాలకు బియ్యాన్ని చేర్చి అధిక మొత్తంలో జమచేసి గుట్టు చప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ తమ అక్రమ రేషన్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ అధిక మొత్తంలో డబ్బులు దండుకుంటున్నట్లు ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అక్రమ రేషన్ బియ్యం దందాను అరికట్టి విచ్చలవిడిగా రెచ్చిపోతున్న వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
రేషన్ బియ్యం అక్రమ దందాను అరికట్టాలి
ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు అందించే బియ్యన్ని రేషన్ డీలర్లు అక్రమ వ్యాపారులతో కుమ్మక్కకై అక్రమ రేషన్ వ్యాపారాన్ని చేస్తున్నారని వారిపై తగు చర్యలు తీసుకుని వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కానీ నిర్లక్ష్యం గా వ్యవహారిస్తున్నారని, విషయం తెలిసినా కానీ అధికారులు తమకేమి పట్టనట్టు వారి తీరు ఉందని అక్రమ రేషన్ బియ్యం దందాను అడ్డుకోవడం లో పూర్తిగా విఫలమైన అధికారులపైన తగు చర్యలు తీసుకోవాలని,ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ వ్యాపారులను ప్రోత్సహిస్తున్న రేషన్ డీలర్ షిఫ్ లను వెంటనే రద్దు చేసి చట్టప్రకారం వారి పై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలకోరుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.