Friday, May 8, 2026
spot_img

ఎనిమిదవ రోజున శ్రీ దుర్గాదేవి అలంకారం

నారద వర్తమాన సమాచారం

ఎనిమిదవ రోజున శ్రీ దుర్గాదేవి అలంకారం

పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది ఏ రూపం…🌷

శ్రీ దుర్గాదేవి అలంకారం (10-10-2024)

దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణములు చెబుతున్నాయి.

ఈ రోజు దుర్గా దేవి ఆయుధాలను పూజిస్తారు కాబట్టి ఈ రోజు ‘ అస్త్ర పూజ ‘ (ఆయుధాలు) అని కూడా అంటారు . ఈ రోజున ఆయుధాలు లేదా యుద్ధ కళలను ఉపయోగించడం వలన ఈ రోజును వీరా అష్టమి అని కూడా పిలుస్తారు .

పంచప్రకృతి స్వరూపములలో ప్రధమమైనది దుర్గారూపము. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. విజయము కలుగుతుంది. సకల గ్రహ దోషములు అమ్మను పూజించినంతమాత్రమునే ఉపశమింపబడతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి.

కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగి, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. మహా ప్రకృతి స్వరూపిణి. సమస్త దేవీ, దేవతా శక్తులు, తేజస్సులువిజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదోరోజున కనకదుర్గమ్మ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఆశ్వయుజ అష్టమిని దుర్గాష్టమిగా పేర్కొంటారు. దుర్గాదేవి రూపంలోని అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. మరోవైపు దీక్ష విరమణ కోసం భవానీలు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తారు. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని జగన్మాత సంహరించారు. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత.

మహా ప్రకృతి స్వరూపిణి. సమస్త దేవీ, దేవతా శక్తులు, తేజస్సులు మూర్తీ భవించిన తేజోరూపం ఈ తల్లి స్వరూపంగా ఉంటుంది. ఉగ్రరూపంతో దుష్టులను ఏవిధంగా సంహరిస్తుందో, అదే సమయంలో పరమ శాంతమూర్తిగా తనను కొలిచిన భక్తులను కాపాడుతుంది. దేవి భాగవతం, మార్కండేయ పురాణాలు, ఉపనిషత్తులు, రుగ్వేదాల్లో దుర్గాదేవి ఉపాసన గురించి పలు వివరాలున్నాయి.

ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమష్టి ఆరాధనే దుర్గాదేవి ఉపాసన. ఎర్రని వస్త్రాన్ని ధరించి, మణులు పొదిగిన కిరీటం శిరస్సుపై ఉంచుకుని, సింహ వాహనాన్ని అధిరోహించి, ఎనిమిది చేతులతో కత్తి, డాలు, గద, శంఖం, కలశం, త్రిశూలం, చక్రం, ధనుర్బాణాలు ధరించి ఉంటుంది. ఈ రూపంలోని దేవిని ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో పూజించాలి. ఈరోజు అమ్మకు సమర్పించే నైవేద్యం కదంబం, శాకాన్నం.

పూజా విధానము: ఎర్రని బట్టలు పెట్టి, ఎర్రని అక్షతలతో, ఎర్రని పూలతో అమ్మని పూజించాలి.

మంత్రము: “ఓం దుం దుర్గాయైనమః” అనే మంత్రమును పఠించాలి.
దుర్గా సూక్తము పారాయణ చేయవలెను.
దుర్గా, లలితా అష్టోత్తరములు పఠించవలెను.

8.!! శ్రీ దుర్గా దేవి !!

🍀ఎనిమిదవ రోజు

!!కదంబం ప్రసాదం కావలసినవి !!
కందిపప్పు 1/2 కప్
బియ్యం 1/2 కప్ (కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది)
1 వంకాయ
1/4 సొర్రకాయ
1 దోసకాయ
బీన్స్ తగినన్ని
1 పోటాటో
వేరుశెనక్కాయలు ( పీనట్ ) 2 పిడికిళ్ళు
2 మొక్కజొన్నలు
1/2 క్యారెట్
2 టోమాటో
తగినంత కరివేపాకు
కోత్తమీర
కోరిన పచ్చి కొబ్బెర 1 చిప్ప
4 పచ్చి మిర్చి
నూనె తగినంత
నెయ్యి చిన్న కప్పు
చింతపండు గొజ్జు తగినంత
కాస్త బెల్లం ( జాగిరి )
ఉప్పు, పసుపు తగినంత
3 చెంచాలు సాంబర్ పౌడర్
పోపు గింజలు,ఎండుమిర్చి, ఇంగువ.

!!!! చేయవలసిన విధానము !!!!
🍀ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని వుంచుకోండి. కుక్కర్లో కందిపప్పు, బియ్యం, పీనట్, టోమాటో తప్ప అన్నీ కూరగాయలు వేసిపసుపు, ఉప్పు, నీళ్ళు 5 కప్పుల వేసి రెండు విజిల్ వచ్చాక stove off చేయండి.మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాత పచ్చిమిర్చి, కరేపాకు, టొమాటో, చింతపండు గొజ్జు, సాంబర్ పౌడర్, జాగిరి వేసి బాగా వుడికిన తరువత ఆ గ్రేవి అంతా వుడికిన రైస్లో వేసి, కోత్తమీర, కరేపాక్, నెయ్యి వేసిమరోసారి వుడికించండి అంతా బాగా వుడికిన తరువాత, ఎండుమిర్చి, ఇంగువతో తాలింపు పెట్టి కొబ్బరి కలిపి దించండి వేడి వేడిగా దుర్గాదేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version