నారద వర్తమాన సమాచారం
వినుకొండ
అభాగ్యులకు ఆపన్నహస్తంలా ముఖ్యమంత్రి సహాయనిధి: ఎమ్మెల్యే జీవీ
లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీవీ
విధివక్రించిన అభాగ్యులు ఎందరికో ముఖ్యమంత్రి సహాయనిధి ఆపన్నహస్తంలా ఆదుకుంటోందన్నారు వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. అయిదేళ్లుగా తీవ్ర ఒడుదొడుకుల్లో ఉన్న ఆ కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చాక అవసరంలో ఉన్న ఎంతోమందికి సాయం అందించగలుగుతోందన్నారు. వైద్య ఖర్చుల కోసం పేద ప్రజలు అప్పులపాలు కాకుండా, కార్పొరేట్ స్థాయి వైద్యం కోసం సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వినుకొండ నియోజకవర్గానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు రూ.7.37 లక్షల విలువైన ముఖ్యమంత్రి ఆర్థిక సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అందజేశారు. శనివారం వినుకొండ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాగులవరానికి చెందిన గాదు చిన్న కొండయ్యకు రూ.2.80 లక్షలు, అగ్నిగుండాలకు చెందిన భూక్యా కోటి నాయక్ కు రూ.1,02,619, కారుమంచికి చెందిన రావెళ్ల హనుమాయమ్మకు రూ.81 వేలు, వినుకొండ పట్టణానికి చెందిన పఠాన్ ఆయూబ్ ఖాన్ కు రూ.2,74,380 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. బాధితులకు అందుతున్న సాయం, చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఇచ్చే వారి సంఖ్య, మొత్తం కూడా గణనీయంగా పెరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని, ఆపరేషన్ చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులను అందించామన్నారు. వినుకొండ నియోజకవర్గం పరిధిలో ఇంకా ఎవరైనా అవసరం ఉంటే, ఆ విషయం తన దృష్టికి వస్తే మాత్రం తప్పక సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సాయం అందించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. గత వైసీపీ పాలనలో సీఎం సహాయ నిధి కింద ఎవరికి సాయం అందేది కాదన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతీ పేదవాడికి సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందుతుందన్నారు. ఆపదకాలంలో ఆదుకునే సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జీవీ సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.