నారద వర్తమాన సమాచారం
వినుకొండ
ఏడాదిలోపు రామలింగేశ్వర స్వామి గుడికి ఘాట్ రోడ్డు: ఎమ్మెల్యే జీవీ
వినుకొండపై కొలువైన రామలింగేశ్వర స్వామి గుడికి ఏడాదిలోపు ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు ఎమ్మెల‌్యే జీవీ ఆంజనేయులు. అందుకు కావాల్సిన నిధులకు మంజూరు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక కృ।తజ్ఞతలు తెలిపారు. స్థానికులు, దాతలు సహకరిస్తే ఆ ఆలయాన్ని మరిన్ని సౌకర్యాలతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. వినుకొండ బోసుబొమ్మ సెంటర్ లోని శ్రీ సమర్ధ సద్గురు షిర్డీ సాయిబాబా 64వ ఆరాధన మహోత్సవాల్లో ఆదివారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవీ సాయిబాబాకు జీవీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ సీతారాముల కల్యాణం కన్నులవిందుగా నిర్వహిస్తున్న బ్రాహ్మణులు, కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలంటే అదృష్టం ఉండాలన్నారు. ప్రజందరికీ ఆయు రారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని దేవుడిని కోరుకుంటా అన్నారు. కొండ పై రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని త్వరలో పూర్తి చేయాలని సంకల్పంగా తీసుకున్న ట్లు తెలిపారు. మధ్యలో ఆగిపోయిన ఆ పనులు పూర్తి చేయడానికి భక్తులందరి సహాయసహకా రాలు కావాలని కోరారు. గత ప్రభుత్వంలో రూపాయి ఇవ్వలేదని, ఇటీవల ముఖ్యమంత్రి చంద్ర బాబును అడగగానే గుడి కోసం రూ.2కోట్లు ఇచ్చారని తెలిపారు. ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి కోసం నిధులు అడగ్గానే 9, 10 ఎన్ని కోట్లయినా ఇవ్వమని అధికారులను ఆదేశించారని సంతో షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహకారం కూడా పూర్తిస్థాయిలో ఉన్నందున ఏడాది కాలంలో ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అలానే వినుకొండలో టీటీడీ కల్యాణ మండపానికి అడగ్గానే సీఎం రూ. 3 కోట్లు ఇచ్చారన్నారు. త్వరలోనే తితిదే నుంచి పెద్ద కల్యాణ మండపం పూర్తి చేసుకుంటామన్నారు. ఇంటింటికీ మంచినీటి కార్యక్రమాన్ని కూడా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలసి త్వరలోనే సాకారం చేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి రూ. 14లక్షల కోట్లు అప్పులు వారసత్వంగా ఇచ్చి పోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులున్నాయని, అయినా త్వరలోనే ఆ హామీని కూడా నెరవేర్చుతామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. కచ్చితంగా రానున్న 3 ఏళ్లలో ఇంటింటికీ మంచినీరు ఇస్తామన్నారు. ఇంటింటికీ మంచినీరు, కొండమీద గుడి, ఘాట్ రోడ్, టీటీడీ కల్యాణమండపం ఇవన్నీ తన చిరకాల స్వప్నాలని, అవన్నీ తన చేతుల మీదుగానే పూర్తి కాబోతున్నాయన్నారు. కొండమీదకు మెట్లదారికి తనవంతు ఆర్థిక సాయం చేస్తానని, పెద్దలు ముందుకు వచ్చి తలా 4 మెట్లు కట్టిస్తే భక్తులంతా మెట్ల పూజలు చేసుకుంటారన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.