నారద వర్తమాన samachara
పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయం,
నరసరావుపేట
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్
ఈ స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 43 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
కారంపూడి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన మాగంటి వీర సైదులు అను అతను నరసరావుపేట లోని ఈశ్వర్ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నందు 30 లక్షల చిట్టి పాట 40 నెలలకు గాను ప్రతి నెల 75 వేల రూపాయలు చొప్పున 20 నెలల పాటు సుమారు 15 లక్షలు కట్టినాడు. అతని ఆర్థిక పరిస్థితి బాగా లేని కారణంగా మిగిలిన 20 నెలలకు గాను డబ్బు చెల్లించలేకపోయాడు గడువు ముగిసి రెండు సంవత్సరాలు అయినను ఆ కంపెనీ వారు తమకు పోవలసిన కమిషన్ తీసుకొని ఫిర్యాదుకు రావలసిన డబ్బులు ఇప్పించమని ఎన్నిసార్లు అడిగినా ఎటువంటి సమాధానం లేకుండా ఆఫీసుకు తిప్పుతున్నట్లు కావున తగు న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలసి
ఫిర్యాదు చేయడం జరిగింది.
చిలకలూరిపేట సంజీవనగర్ కు చెందిన మేళం రాజకుమారి భర్త అయిన యేసుదానం సుమారు మూడు నెలల క్రితం మరణించాడు. కావున వారికి ఉన్న 1 1/4 సెంటు భూమిని ఆక్రమించాలనే దురుద్దేశంతో అన్నలదాసు తులసమ్మ, అన్నల దాసు మోషే మరియు వారి సహచరులు అయిన కొచ్చర్ల రాణి, కొచ్చర్ల కోటయ్య అనువార్ల సహకారంతో ది. 08.10.2024 వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఫిర్యాదు ఇంటి స్థలం లోనికి అక్రమంగా ప్రవేశించి ఇంటి స్థలమునకు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను తొలగించారు. అంతట ఫిర్యాది అడ్డు వెళ్ళగా కొచ్చర్ల కోటయ్య, కొచ్చర్ల రాణి అన్నలదాసు మోషే మరియు అన్నలు దాసు తులసమ్మ అనువారు బూతులు తిట్టి అసభ్యకరంగా ప్రవర్తించి కింద పడవేసి కొట్టినట్లు మరియు పై నలుగురు కలిసి ఫిర్యాదు ఇంటిని
జె సి బి ద్వారా తొలగించి ఆక్రమణ చేయుటకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎస్పీ ని కలసి ఫిర్యాదు చెయ్యడం జరిగింది.
నరసరావుపేట మండలం రంగారెడ్డి పాలెం గ్రామానికి చెందిన దండే శివకుమార్ ఉద్యోగం గురించి ప్రయత్నం చేయుచుండగా అతనికి పరిచయస్తుడైన విశాఖపట్నం నివాసి అయిన ఎస్ కోట ఎమ్మెల్యే పీఏ అయిన అమర సర్వ దేవుళ్ళు అలియాస్ సర్వ అతని ద్వారా హరీష్ శ్రీనివాసరావు అనువారు పరిచయమైనట్లు, ఈ క్రమంలో వారు ఫిర్యాదుతో సర్వ అతను ఎస్ కోట ఎమ్మెల్యే అయిన కడిబంది శ్రీనివాసరావు అను వారి వద్ద పిఏ అని చెబుతూ శ్రీనివాసరావు అను అతను ముత్యాల నాయుడు మినిస్టర్ వద్ద ఓఎస్డి గా పనిచేస్తూ, హరీష్ ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉంటారని ఫిర్యాదుతో చెప్పినవారు. వీరు ముగ్గురు కలిసి ఉద్యోగం ఇప్పి స్తానని 10 లక్షల రూపాయల వరకు తీసుకొని ఉద్యోగం ఇవ్వలేదని ఇంక ఉద్యోగం రాదనే ఉద్దేశంతో న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
ఎడ్లపాడు మండలం జగ్గాపురం గ్రామానికి చెందిన కొణతం సంధ్యారాణి కాటూరి హాస్పటల్ నందు GNM గా పనిచేస్తున్నట్లు అదే సమయంలో లింగారావు పాలెం గ్రామానికి చెందిన అప్పారావు హాస్పిటల్ నందు క్రేన్ డ్రైవర్ గా పని చేస్తూ వెళ్లి ఫిర్యాదుతో పరిచయం పెంచుకొని గుణదల నందు వివాహం చేసుకొని బోయపాలెం గ్రామం నందు కాపురం పెట్టి అక్కడ ఫిర్యాదు వద్ద బంగారం అంతా తీసుకొని వెళ్ళినట్లు, అదేమని అడగగా అప్పారావు తరఫున బంధువులు బెదిరిస్తున్నట్లు, తర్వాత అప్పారావు గురించి విచారించుకొనగా అప్పారావు కు అప్పటికే రెండు వివాహాలు జరిగినట్లు తెలిసి న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలసి ఫిర్యాదు చెయ్యడం జరిగింది.
నరసరావుపేట పోస్టల్ కాలనీ కు చెందిన కాసు మహేష్ వర్ధన్ రెడ్డి జాబ్ కోసం తన స్నేహితుడైన నకరికల్లు వాస్తవ్యుడు కోటి అను అతని ద్వారా ఆలపర్తి సుజన నాయుడు అను అతనికి ఉద్యోగం నిమిత్తం 2,30,000 రూపాయలు కట్టినట్లు, అనంతరం ఫిర్యాదికి మెయిల్లో జాబ్ ఆఫర్ లెటర్ పంపించి, ఎప్పుడు ఉద్యోగంలో చేరాలి అనే సమాచారం ఇవ్వక పోయేటప్పటికి హైదరాబాద్ కు ఉద్యోగ ఆఫర్ లెటర్ లో ఉన్న అడ్రస్ కు వెళ్ళగా అక్కడ ఆ పేరుతో ఎటువంటి కంపెనీ లేదని అక్కడ ఉన్న స్థానికులు తెలుపగా ఫిర్యాదు మోసపోయిన విషయం గ్రహించి వెంటనే ఆలపర్తి సుజన్ నాయుడుకు ఫోన్ చేయగా నేను విచారిస్తాను అని చెప్పి ఇప్పటినుండి ఫిర్యాదు ఫోన్ లిఫ్ట్ చేయకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేస్తున్నట్లు, కావున తనకు న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలవడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసిపెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.