నారద వర్తమాన సమాచారం
తిరుమల శ్రీవారి మెట్ల మార్గం మూసివేత?
తిరుపతి జిల్లా:
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మెట్ల మార్గాన్ని రెండు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించింది, ఈ మేరకు టీటీడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో తిరుమల తడిసి ముద్దయింది, దీంతో 17,18,తేదీల్లో శ్రీవారి మెట్ల మార్గాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది,భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది ఈరోజు సాయంత్రం నుండి శ్రీవారి నడక మార్గాన్ని మూసివేయనున్నారు.
ఇప్పటికే పాప వినాశనం, శ్రీవారి పాదాల మెట్టు మార్గాలు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈవో శ్యామల రావు ఆదేశించారు.గత రెండు రోజులుగా తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వానలతో ఘాట్ రోడ్ లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అలర్ట్ అయ్యింది. భక్తుల భద్రత ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది,ఇవాళ సాయంత్రం వరకు ఆ మార్గంలో భక్తులను అనుమతిస్తారు.
ఆ తర్వాత ఆ మార్గాన్ని మూసివేస్తారు.మళ్లీ వర్షాలు తగ్గుముఖం పట్టేంతవరకు శ్రీవారి మెట్ల నడక మార్గాన్ని మూసివేసే పరిస్థితి ఉంది. తిరుమల, ఘాట్ రోడ్, నడకదారిలో వర్షం కారణంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్యామలరావు సిబ్బందికి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.