నారద వర్తమాన సమాచారం
విజయవాడ
15-10-2024
N.T.R.జిల్లా పరిటాల్లో మిల్లులో మంత్రి నాదెండ్ల తనిఖీ
100 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామ సమీపంలోని శ్రీ లక్ష్మీ గణపతి రైస్ మిల్లులో అక్రమంగా నిలవకుండా రేషన్ బియ్యాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలో పట్టుకున్నారు..
నిల్వ ఉన్న బియ్యం బస్తాలను గుర్తించిన అధికారులు
పేద ప్రజల ఆహార భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది.
పేదల ఆహారం కోసం అందించే రేషన్ బియ్యం అక్రమార్కులకు వ్యాపార వస్తువుగా మారి కాసులు కురిపిస్తున్నాయి.
రేషన్ బియ్యాన్ని ఇతర బియ్యంతో కలుపుతూ ఎక్కువ ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న ఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి.
ఈ క్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపారు..
అందులో భాగంగా నేడు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల రైస్ మిల్ తనిఖీ చేశారు.
పరిటాల గ్రామంలో లక్ష్మీ గణపతి రైస్ మిల్లు ను మంత్రి నాదెండ్ల తనిఖీ చేసి అక్రమంగా నిలవకుండా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు
అక్రమంగా నిల్వ ఉన్న 100 టన్నుల బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. కార్డుదారుల నుండి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి భారీ నిల్వలు ఉంచారు.
రేషన్ బియ్యాన్ని నిర్వాహకులు రీసైక్లింగ్ చేసి సాంబమసూరు బియ్యంలో కలిపి భారీ అమ్మకాలు జరుపుతున్నట్లుగా విచారణలో బయటపడింది. లారీతోపాటు రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన్నట్లు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.