నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో మహా పుణ్య కవి,రామాయణాన్ని అందించిన మహానుభావుడు శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించి, ఆయన చిత్రపటానికి పులమాలలతో నివాళులర్పించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ….
కుటుంబ మరియు మానవతా విలువలు ప్రతిబింబించే విధముగా మహాకావ్యం రామాయణాన్ని రచించి,సమాజానికి అందించిన వాల్మీకి మహాకవి కృషి ఎనలేనిది.ఉన్నతమైన ఆదర్శ భావాలను బోధించే మధుర కావ్యం రామాయణం, అటువంటి గొప్ప కావ్యాన్ని రచించి,యుగాలు మారినా కూడా ఆదర్శంగా నిలిచే విధంగా సమాజానికి అందించిన మహోన్నత వ్యక్తి వాల్మీకి
ఆయన ప్రబోధించిన ఆశయాలను, పవిత్రమైన ఆలోచనలను ప్రతి ఒక్కరూ జ్ఞప్తికి తెచ్చుకుంటూ, స్వార్థచింతన, నాది, నేను అనే దురాశ నుంచి విముక్తి పొంది సన్మార్గంలో నడవడమే వాల్మీకి మహర్షికి మనం ఇచ్చే నిజమైన నివాళి. ప్రతి ఒక్కరూ వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ జె.వి.సంతోష్(పరిపాలన విభాగం)RI లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయం, నరసరావుపేట….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.