నారద వర్తమాన సమాచారం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పొలం పిలుస్తుంది అనే ప్రోగ్రామ్ ఈరోజు దాచేపల్లి మరియు నడికుడి గ్రామాలలో నిర్వహించడం మరియు వరి సాగు చేసే గ్రామాలలో సామూహిక ఎలుకల నిర్ములనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ ప్రోగ్రాం లో మండల వ్యవసాయ అధికారి డి పాప కుమారి దాచేపల్లి వారు మాట్లాడుతూ
వరి సాగు చేసే గ్రామాలలో రైతు సేవా కేంద్రాలలో సామూహిక ఎలుకల నిర్ములనా కార్యక్రమము నిర్వహించడం జరిగింది.
ఎలుకల వలన వరి పంటలో 10%నుండి 40% వరకు నష్టం వాటిల్లుతుంది.
విషపుఎర తయారీ(100గ్రా”):
2గ్రా “బ్రోమోడేయోలిన్ మందును, 96గ్రా “నూకలు, 2గ్రా “నూనె కలిపి తయారు చేసుకొవలెను.
రైతులను బ్రోమోడేయోలిన్ ఎలుకల మందు కలిపిన ఎరను రైతు సేవా కేంద్రాల ద్రారా ఉచితంగా పొందలరు అని తెలియపరచారు.
భూసార పరీక్ష చేయించుకొని సాయిల్ హెల్త్ కార్డ్ ఆధారంగా ఎరువుల మోతాదును నిర్ణయించిన మోతాదులను వాడవలసిందిగా కోరారు.
రైతులు ఎరువుల వాడకాన్ని కొంచెం తగ్గించి జీవన ఎరువులు అయినా అజిటోబాక్టర్, మైకోరైజా, సూడోమోనాస్ మొదలగునవి ఉపయోగించి, అదేవిధంగా పచ్చిరొట్టె ఎరువులు అయినా జనుము, జీలుగ, పిల్లి పెసర వాడకం వలన భూసారం పెంచవచ్చు అని చెప్పారు. ప్రత్తి, కంది మరియు వరి పంటలలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులను వివరించారు.
తప్పకుండా రైతులు విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలని సూచించారు. కొద్దికొద్దిగా ఎరువులను తగ్గిస్తూ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని కోరారు.
ఈ ప్రోగ్రామ్ లో వ్యవసాయ, పశుసంవర్ధక, ప్రకృతి వ్యవసాయ, మార్కెటింగ్, రైతు సేవా కేంద్రాలలోని
VAA/VHA లు, ఆ గ్రామాలలోని రైతులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.