నారద వర్తమాన సమాచారం
ప్రకాశం జిల్లా
అనుమతులు లేకుండా, నిబంధనలు అతిక్రమించి బాణసంచా విక్రయించే వారిపై చట్ట ప్రకారం చర్యలు: ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఐపియస్
బాణసంచా విక్రయదారులు చట్టం సూచించిన నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలి.
పిల్లలు బాణాసంచా కాల్చే సమయంలో తల్లిదండ్రులు పర్యవేక్షణ ఉండాలి
జిల్లాలో అక్రమంగా టపాసులు తయారు, సరఫరా, విక్రయాలు చేసే వారిపై ప్రత్యేక నిఘా: జిల్లా ఎస్పీ
దీపావళి పండుగ నేపథ్యంలో నిబంధనలను అతిక్రమించి టపాసులు విక్రయించినా నిల్వ ఉంచినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో బాణసంచా తయారీ లేదా విక్రయాలు లైసెన్సు కల్గిన వారు ప్రభుత్వ నియమ నిబంధలనకు లోబడి ఉండాలని, బాణసంచాలు మరియు పేలుడు పదార్థాలు ఇంట్లో నిల్వ ఉంచరాదని, శాశ్వత & తాత్కాలిక బాణసంచా తయారీ లేదా విక్రయాల లైసెన్సు కల్గిన దుకాణాల్లో మాత్రమే బాణసంచా అమ్మాలని, బహిరంగ ప్రదేశాల్లో నిర్ణీత కొలతల మేరకు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసుకోని విక్రయించుకోవాలన్నారు. షాపుల వద్ద మండే స్వభావం కల్గిన వస్తువులు ఉంచరాదని, నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోవాలని, ఆ పరిసరాల్లో ఏమి చేయాలో ఏమి చేయకూడదో తగు సూచనలు చేస్తూ బోర్డులను ప్రదర్శనలో ఉంచాలి. చిన్న పిల్లలను బాణా సంచా దుకాణాల్లో విక్రయాలకు ఉంచుకోరాదన్నారని, లైసెన్స్ లు కల్గిన దుకాణదారులు మాత్రమే బాణసంచా విక్రయాలు చేయాలన్నారు. ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని, బాణసంచా దుకాణాలకు దూరంలో వాహనాలను నిలుపుకునేలా చూసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘన జరిగితే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
జిల్లాలో అక్రమంగా తయారయ్యే టపాసులు, సరఫరా, విక్రయాలు చేసే వారిపై వారిపై నిఘా ఉంచాలని, టపాసుల స్టాల్ల్స్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పాటించు విధంగా చర్యలు తీసుకోవాలని, నిరంతర తనిఖీలు నిర్వహించి మతాబుల దుకాణాల వద్ద భద్రత చర్యలను ఎప్పటికపుడు పరిశీలన చేయాలని, ముందస్తు జాగ్రత్తలు వల్లనే ప్రమాదాలను నివారించగలమని అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు.
దీపావళి పర్వదినాన్ని జిల్లా ప్రజలు అందరూ ఆనందంగా జరుపుకోవాలని, సాధ్యమైనంతవరకు కాలుష్యరహిత టపాసులనే కాల్చాలని, టపాసులు కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించాలని, సిల్క్ వస్త్రాలు ధరించవద్దని, అదేవిధంగా ప్రజలకు, రోడ్డు వెంబడి వెళ్లే వాహనాలకు ఇబ్బందులు కలగకుండా టపాసులు కాల్చాలని తెలియజేశారు. ముఖ్యంగా పిల్లలు పట్ల అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు టపాసులు కాల్చే సమయంలో పెద్దల పర్యవేక్షణ ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు.
దీపావళి రోజున ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, అత్యవసర సమయంలో ఫైర్ స్టేషన్ కు 101, పోలీస్ డయల్ 100/112 లకు లేదా పోలీస్ వాట్స్అప్ నెంబర్ 9121102266 లేదా స్థానిక పోలీసుల కు గాని తెలియ చెయ్యాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా బాణసంచా అక్రమ విక్రయాలు, నిల్వల సమాచారాన్ని ఉంటే పోలీసులకు తెలియచేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ తెలియచేసినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.