నారద వర్తమానంసమాచారం
జిల్లా పోలీస్ కార్యాలయం, పల్నాడు జిల్లా.
*కుటుంబ సభ్యులతో దీపాల పండుగ ను ఆనందంగా జరుపుకోండి….పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు
ఐ.పి.యస్
దీపావళి పండుగను పురస్కరించుకొని ఎస్పీ బాణసంచా విక్రించేవారికి సూచనలు చేశారు.
- దీపావళి బాణసంచా విక్రయించే దుకాణాలు, తయారీ కేంద్రాలు, నిల్వ చేసే గోడౌన్లకు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి ఉండాలి.
- నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు పాటించాలి
- నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం.
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు, ఐపీఎస్
దీపావళి బాణసంచా తయారీ కేంద్రాలు, నిల్వ చేసే గోడౌన్స్, విక్రయించే దుకాణాలకు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి ఉండాలని, ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ,ఐపీఎస్ హెచ్చరించారు.
దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తీసుకోవలసిన ముందస్తు చర్యల గురించి జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేసినారు. విక్రయదారులు, గోడౌన్స్, తయారీ కేంద్రాల యజమానులు పాటించవలసిన నిబంధనల గురించి వివరించారు.
జిల్లాలో అనధికారంగా బాణసంచా తయారీ, విక్రయాలు, నిల్వలు చేపట్టే వారిని గుర్తించి, మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటు వద్ద బైండోవరు చేయాలని అధికారులను ఆదేశించారు.
గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రజల శ్రేయస్సును ఉద్దేశించి బాణాసంచా తయారీ కేంద్రాలకు, నిల్వ చేసే గోడౌన్లకు, విక్రయించే దుకాణాలకు పలు నియమ నిబంధనలు సూచించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.
- బాణాసంచా నిల్వచేసే గొడౌన్ నిర్వాహకులు, తయారీ, విక్రయాలు చేసేవారు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుండి అనుమతులు పొందాలి.
- నివాస ప్రాంతాలకు నిర్దిష్ట దూరంలో ఉండాలి.
- అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలి.
- ఆ ప్రదేశాలలో ప్రమాదం జరగడానికి అవకాశం వుండే సిగరెట్లు తాగడం,మంటలు వెయ్యడం వంటి చర్యలు చెయ్యరాదు.
- మండే స్వభావం వున్న పెట్రోల్, అగ్గి పెట్టెలు ఇతర వస్తువులు అనుమతించరాదన్నారు.
- విధులు నిర్వహించే సిబ్బందికి అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవలసిన చర్యలపై అవగాహన ఉండాలి.
- బాణాసంచా విక్రయ దుకాణాలు అధికారులు సూచించిన ప్రదేశాలలోనే ఏర్పాటు చేసుకోవాలి.
- జనావాసాలకు, విద్యాసంస్థలకు, వైద్యశాలలకు దూరంగా బాణాసంచా విక్రయాలు జరగాలి.
- బాణాసంచా విక్రయ దుకాణాల మధ్య నిర్దిష్ట దూరం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
- ప్రతీ దుకాణం వద్ద రెండు అగ్ని నిరోధక సిలెండర్లు, రెండు బకెట్ల పొడి ఇసుక, నీరు అందుబాటులో ఉంచుకోవాలి.
ప్రతీ దుకాణం వద్ద అగ్ని నిరోధక సిలెండర్లు, తగినంత పొడి ఇసుక, కావాల్సిన నీరు అందుబాటులో ఉండాలి.
- మైనర్లును బాణసంచా నిల్వ, తయారు, విక్రయాలు చేసే కేంద్రాలు వద్ద పనుల్లో వినియోగించ కూడదు.
- లైసెన్సు విక్రయదార్లు లైసెన్సు లేని వ్యాపారులకు విక్రయించి, తద్వారా ఏదైనా ప్రమాదం సంభవిస్తే,దానికి లైసెన్సు దారులే బాధ్యత వహించాలన్నారు.
జిల్లాలో బాణసంచా తయారీ, విక్రయాలు చేసేవారు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండి ప్రభుత్వ నియమ నిబంధలకు లోబడి బాణసంచా విక్రయించాలన్నారు.
లైసెన్సులు లేకుండా ఎవరైనా మందుగుండు సామగ్రి తయారుచేసిన, నిల్వ చేసినా, విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
పోలీస్ అధికారులు వారి పరిధిలోని బాణసంచా తయారీ కేంద్రాలను, విక్రయ దుకాణాలను, నిల్వ ఉంచిన గోడౌన్ లను సందర్శించి లైసెన్స్ లు తనిఖీ చేయాలన్నారు.
భద్రత ప్రమాణాలు ప్రభుత్వ నిబంధనల అనుగుణంగా ఉన్నాయా లేదా పరిశీలించాలన్నారు.
ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను పాటించని యడల వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు.
జిల్లాలో ఎక్కడైనా బాణసంచా సామగ్రి అక్రమ విక్రయాలు, నిల్వలకు సంబంధించిన సమాచారం ఉంటే డయల్ 100, 112 నెంబర్ లకు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామనిఎస్పీ తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.