నారద వర్తమాన సమాచారం
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ పల్నాడు జిల్లా కమిటీ
పల్నాడు జిల్లా :
జర్నలిస్టులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని, దాడులు జరిగిన వెంటనే సంబంధితులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా చూడాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ పల్నాడు జిల్లా కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఎస్పీతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులపై దారుణంగా దాడులు జరిగాయని ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ జర్నలిస్టులపై దాడులు జరిగిన వెంటనే సంబంధితులపై చర్యలు తీసుకోవాల్సిందిగాను, తమ పార్టీ వారు దాడులు చేసినట్లయితే వారిని వెంటనే పార్టీ నుంచి తొలగించడం జరుగుతుందని పత్రికా ముఖంగా తెలియజేయడంతో, ప్రస్తుతం జర్నలిస్టులపై దాడులు తగ్గాయని, జర్నలిస్టులపై దాడులకు ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని, దాడులు జరిగిన వెంటనే రాజకీయాలకతీతంగా దాడి చేసిన వారిపై చట్టప్ర కారం చర్యలు తీసుకునేలా చూడాలని యూనియన్ సభ్యులు ఎస్పీని కోరారు.
అలాగే జర్నలిస్టులపై ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు లేదా ఏదైనా పని నిమిత్తం పోలీస్ స్టేషన్ కి వెళ్లిన జర్నలిస్టులతో ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే మీడియాతో వ్యవహరించే విధానంపై పోలీసులకు అవగాహన కల్పించాల్సిందిగా ఎస్పీని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎస్పీ మాట్లాడుతూ జర్నలిస్టులకు తగిన ప్రాధాన్యత ఇస్తామని, అదేవిధంగా తమ పరిధిలోని పోలీసులకు కూడా చెప్తామని, జర్నలిస్టులు, డాక్టర్లు, లాయర్లు సమాజ సేవకులని వారు ఏ సమయంలో ఏ విషయంపై స్టేషన్ కి వచ్చిన సానుకూలంగా స్పందించాలని తెలియజేస్తామని, అలాగే జర్నలిస్టులు కూడా ఏదైనా వార్తను ప్రచురించేముందు సంబంధిత శాఖ అధికారులకు తెలియజేసి, వివరణ కోరి, వారి వివరణతో కూడిన వార్తను ప్రచురిస్తే బాగుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిల్లి యజ్ఞ నారాయణ, ప్రధాన కార్యదర్శి పొన్నెకంటి శ్రీనివాసాచారి, గౌరవ అధ్యక్షులు పగడాల నాగేశ్వరరావు, ఆత్మకూరి కృష్ణ ప్రసాదరావు, ఉప కార్యదర్శి జక్కుల కృష్ణ, ఈసీ మెంబర్లు ములుగురి అశోక్ కుమార్, రామ గణేష్, షేక్ గౌస్ మస్తాన్ వలి షేక్ జిలాని మాలిక్, నీరుమళ్ళ అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.