నారద వర్తమాన సమాచారం
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవు
క్రోసూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ధనూష్
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా పాటించాలని మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవాలని పల్నాడు జిల్లా క్రోసురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ధనుష్ అన్నారు బుధవారం పల్నాడు జిల్లా కోసూరు కస్తూరిబా బాలికల విద్యాలయం లో ఆయన సందర్శించి బాలికలకు ఆరోగ్యాంశాలపై అవగాహన కల్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు సాధారణ వ్యాధులకు మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఋతుక్రమం అన్నది ప్రకృతి ధర్మం అని రుతుక్రమంలో పాటించవలసిన వ్యక్తిగత పరిశుభ్రత గురించి, చేతుల పరిశుభ్రత ఆవశ్యకత గూర్చి, శానిటరీ ప్యాడ్స్ డిస్పోజల్ గూర్చి, థైరాయిడ్ లక్షణాలు గూర్చి వివరించారు ఏమైనా ఇబ్బందికర లక్షణాలుంటే తక్షణమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు ఉపయోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సాంబశివరావు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ కస్తూరిబా పాఠశాల ప్రిన్సిపాల్ ఇందిరా ప్రియదర్శిని ఆరోగ్య కార్యకర్త హైమావతి ఆశా కార్యకర్తలు చంద్రిక పావని లక్ష్మి కేజీబీవీ ఏఎన్ఎం తదితరులు పాల్గొన్నారు
ఆరోగ్య విస్తీర్ణం అధికారి సూచన….?
పర్యావరణ పరిరక్షణ దీపావళిని జరుపుకుందాం
ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్
టపాకాయలు కాల్చడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని గాలి కాలుష్యం శబ్ద కాలుష్యం రసాయన కాలుష్యం చాలా ఎక్కువగా ఉంటుందని కావున పర్యావరణ పరిరక్షణ దీపావళిని జరుపుకోవాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ బుధవారం క్రోసూరులో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టపాసులు కాల్చినప్పుడు శబ్దం 140 డెసీ బెల్స్ దాటుతుందని ఈ శబ్దాల వల్ల తాత్కాలిక చెవుడు, శాశ్వత చెవుడు ఏర్పడుతుందన్నారు దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించటం ద్వారా ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు అన్నారు టపాకాయలు కాల్చేటప్పుడు ముఖ్యంగా ఆల్కహాల్ శానిటైజర్ లను వాడి టపాకాయలను వెలిగించకూడదన్నారు శానిటైజర్లకు తొందరగా మండే స్వభావం ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున దీపావళి రోజు శానిటైజర్లను వాడకపోవటం మంచిదని పేర్కొన్నారు కరెంటు తీగలు, ఎండు గడ్డి, పూరి గుడిసెలు ఉన్న ప్రదేశాల్లో బాణసంచాలు కాల్చ కూడదు అన్నారు టపాకాయలను కాల్చి వాటిని అలాగే రోడ్డుమీద పడేయడం వల్ల ఆ దారి వెంట వెళ్లే వారికి వాటి నుంచి ప్రమాదం కలుగుతుందన్నారు ఒక బకెట్లో ఇసుక పెట్టుకుని అందులో కాల్చిన కాకర పువ్వులు, టపాకాయలను వేయటం మంచిదని పేర్కొన్నారు చిన్న పిల్లలతో పెద్దవారే దగ్గరగా ఉండి జాగ్రత్తగా టపాకాయలను కాల్పించుట మంచిదన్నారు రసాయనాలు కంట్లో పడితే కంటిని పరిశుభ్రమైన నీటితో కడగాలి, కంటిని రుద్దకుండా దోసెలతో నీటిని తీసుకొని కంటికి తగిలేటట్లు చేస్తూ శుభ్రం చేయాలి అని పేర్కొన్నారు వెలుగులు నింపే దీపావళిని పర్యావరణ పరిరక్షణ దీపావళిగా జరుపు కొందామని శాంసన్ పిలుపునిచ్చారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.