నారద వర్తమాన సమాచారం
మరోసారి తిరుమలపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు…
దేశంలో ముస్లిమ్స్ కు తానే ప్రతినిధి అని చెప్పుకునే అసదుద్దీన్ తాజాగా మరోసారి తిరుమల పై సంచలన వ్యాఖ్యలు చేయడం వైరల్ అవుతున్నాయి. తాజాగా తిరుమల తిరుపతికి ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంకు కొత్త చైర్మన్ తో పాటు పాలక మండలిని దీపావళి సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. టీటీడీ బోర్డ్ చైర్మన్ గా టీవీ 5 ఛానెల్ చైర్మన్ బీర్ ఆర్ నాయుడును చంద్రబాబు ప్రభుత్వం ఎంపిక చేసింది.
తిరుపతికి చెందిన ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తిరుమలలో ప్రక్షాళన చేస్తామన్నారు. తిరుమలలో కేవలం హిందువులు మాత్రమే పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాదు దేవుడిపై నమ్మకం లేని వాళ్లను ప్రభుత్వానికి సరెండర్ చేస్తామని చెప్పిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ మండిపడుతున్నారు. తిరుమల తిరుపతిలో కేవలం హిందువులకు మాత్రమే స్థానం ఉండాలని చెబుతున్నారు.
కానీ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు మాత్రం వక్ఫ్ బోర్డ్ తో పాటు వక్ఫ్ కౌన్సిల్ లో నాన్ ముస్లిమ్ లకు చోటు కల్పిస్తూ బిల్లు రెడీ చేసింది. మన దేశంలో హిందూ దేవాలయాలకు ఒక న్యాయం. ముస్లిమ్స్ కు మరో న్యాయమా.. అని మండిపడ్డారు. గతంలో ఒవైసీ తిరుమల లడ్డూ కల్తీపై తనదైన శైలిలో మండిపడ్డారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలపి హిందూ మనోభావాలను దెబ్బ తీయడాన్ని తప్పు పట్టిన సంగతి తెలిసిందే కదా. తాజాగా తిరుమల బోర్డ్ చైర్మన్ బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలను వక్ఫ్ బోర్డ్ కు ముడిపెడుతూ.. మోకాలికి బోడి గుండుకు లింకు పెడుతున్నారంటూ నెటిజన్స్ ఒవైసీ తీరుపై మండిపడుతున్నారు. ఒవైసీ .. రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరుతో కూల్చి వేతలపై కూడా మండిపడిన సంగతి తెలిసిందే కదా.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.