నారద వర్తమాన సమాచారం
వరంగల్
మేడపైన గంజాయి మొక్కలు పెంపకం చేస్తున్న వ్యక్తి అరెస్ట్
సులభంగా డబ్బు సంపాదించడంతో తన అవసరాల కోసం ఒక అడుగు ముందుకేసి తన ఇంటి మేడపైన గంజాయి మొక్కల పెంపకాన్ని గృహ పరిశ్రమగా ప్రారంభించి చివరికి పోలీసులకు చిక్కి కటాకటాలు పాలైనాడు.
వివరాల్లోకి వెళితే వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన పల్లెబోయిన కుమార్ (60), సులభం డబ్బు సంపాదనతో పాటు తన అవసరాలకోసం ఏకంగా ఒక గృహపరిశ్రమ తరహాలో నిందితుడు తన ఇంటి మేడపైనే పూల కుండీల్లో గంజాయి మొక్కల పెంపకం చేపట్టాడు. గురువారం రైల్వే స్టేషన్లో తనిఖీ లు యాంటీ డ్రగ్స్ టీం పోలీసులకు పక్క సమాచారం రావడంతో పోలీసులు మత్తు పదార్థాలను పసిగట్టే పోలీస్ జాగిలంతో మేడ పైన గంజాయి మొక్కలను గుర్తించి వాటి స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇంటి యాజమాన్ని డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు గంజాయి మొక్కలు పెంపకం చేపట్టిన నిందితుడి మీల్స్ కాలనీ పోలీస్ అప్పగించడమైనది.
ఈ తనిఖీల్లోవరంగల్ రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేసిన యాంటీ డ్రగ్స్ టీం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్స్ టీం, ఇంతేజార్ గంజ్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం వరంగల్ రైల్వే స్టేషన్ లో పోలీస్ జాగిలంతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు అనుమానస్పదంగా ప్రయాణికుల సామానుతో పాటు, బ్యాగ్ లను పోలీసులు పోలీస్ జాగిలంటో తనిఖీ చేయించారు. ఈ సందర్బంగా యాంటీ డ్రగ్స్ టీం ఇంచార్జి ఇన్స్ స్పెక్టర్ సురేష్ ప్రయాణికులతో మాట్లాడుతూ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు రహస్యం గంజాయి లాంటి మత్తు పదార్థాలను అక్రమ చేస్తున్న, విక్రయిస్తున్న, వినియోగిస్తున్న తక్షణమే 8712584473 సెల్ నంబర్ కు సమాచారం అందించాలని. సమాచారం అందించిన వారి వివరాలు గొప్యంగా ఉంచబడుతాయని తెలిపారు. ఈ తనిఖీల్లో
యాంటీ డ్రగ్స్ టీమ్ ఇన్స్పెక్టర్స్ జె సురేష్, ఆర్ఐ శివ కేశవులు, ఆర్ ఎస్ఐ పూర్ణ చంద్రా రెడ్డి , ఎస్ఐ చాంద్ పాషా, ఏఎస్ఐ సాంబయ్య మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.